iPhone 15 Pro Max | డ్రాగన్ ‘నిషేధం’ భేఖాతర్.. ఐ-ఫోన్ లపై మనస్సు పారేసుకున్న చైనీయులు..!
iPhone 15 Pro Max | ఆపిల్ ‘ఐ-ఫోన్ 15’ ప్రో మ్యాక్స్ ఫోన్ల కోసం చైనా, అమెరికా, జపాన్ సహా పలు దేశాల్లోని స్మార్ట్ పోన్ ప్రియులు నవంబర్ వరకూ ఎదురు చూడాల్సిందే.
iPhone 15 Pro Max | ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, అధికారులు ఐ-ఫోన్ వాడొద్దని చైనా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. చైనాలో అతిపెద్ద ఆపిల్ సేల్స్ చానెల్ ‘జేడీ డాట్ కామ్’ వద్ద శుక్రవారం సాయంత్రం వరకూ 34 లక్షలకు పైగా నాలుగు ‘ఐ-ఫోన్-15’ మోడల్ ఫోన్ల ప్రీ బుకింగ్స్ నమోదయ్యాయి. ఆలీబాబా టీ-మాల్ ఆపిల్ స్టోర్లో లిస్టయిన నిమిషంలోపే హై ఎండ్ ఐ-ఫోన్ 15 ప్రో, ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్స్ అమ్ముడయ్యాయని చైనా మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉంటే ఆపిల్ న్యూ ‘ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్’ ఫోన్ కోసం చైనాతోపాటు జపాన్, అమెరికా పౌరులు నవంబర్ నెలాఖరు వరకూ వేచి ఉండాల్సి వస్తుందని తెలుస్తోంది. శుక్రవారం నమోదైన ప్రీ-ఆర్డర్లతో ఐ-ఫోన్లకు గట్టి గిరాకీ ఉంటుందని సమాచారం. ప్రభుత్వోద్యోగులు ఐ-ఫోన్ వాడొద్దని చైనా ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆపిల్ ఐ-ఫోన్లకు అతిపెద్ద మార్కెట్ అయిన చైనాలో సేల్స్ తగ్గుతాయా? అన్న ఆందోళనలు వ్యక్తమైనా ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ కోసం చైనీయులు నాలుగైదు వారాల పాటు వెయిట్ చేయాల్సి రావడం ఆసక్తికర పరిణామం. ఈ నెల 22 నుంచి డెలివరీ ప్రారంభం అవుతాయని ప్రకటించినా ఆపిల్ వెబ్సైట్ ప్రకారం ఐ-ఫోన్ 15 ప్రో కోసం రెండు నుంచి మూడు వారాలు చైనీయులు వెయిట్ చేయాల్సి వస్తున్నది.
ఐ-ఫోన్లకు అతిపెద్ద మార్కెట్ అమెరికాలో బుక్ చేసుకున్న స్మార్ట్ ఫోన్ ప్రియులు ఐ-ఫోన్15 ప్రో మ్యాక్స్ కోసం ఆరు నుంచి ఏడు వారాలు వెయిట్ చేయాల్సిందే. ఇక జపాన్లో ఐదారు వారాలు వేచి ఉండాలని ప్రీ-ఆర్డర్లు చెబుతున్నాయి.
కానీ, చైనా మాదిరిగా అమెరికా, జపాన్ల్లో ఐ-ఫోన్ 15 ప్రో మోడల్ 128 జీబీ స్టోరేజీ వర్షన్ కోసం రెండు మూడు వారాలు ఓపిగ్గా ఎదురుచూడాల్సి వస్తున్నది. ఐ-ఫోన్15 ప్రో మ్యాక్స్ ఫోన్ల డిస్ ప్లేల సరఫరాలో సమస్యల వల్లే ఆ ఫోన్ల డెలివరీ కోసం కస్టమర్లు వేచి చూడాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆపిల్ ఐ-ఫోన్15 సిరీస్ ఫోన్లకు పోటీగా చైనా టెక్ జెయింట్ హువావే మేట్ 60 సిరీస్ ఫోన్లు ఆవిష్కరించినా.. ఐ-ఫోన్ ప్రేమికులు అదనంగా 600 డాలర్లకు పైగా (సుమారు రూ.50 వేలకు పైగా) చెల్లించడానికి సిద్ధ పడుతున్నారని కౌంటర్ పాయింట్ సీనియర్ అనలిస్ట్ ఇవాన్ లామ్ తెలిపారు. ఐ-ఫోన్ 11, ఐ-ఫోన్ 12 సిరీస్ ఫోన్లను రీ ప్లేస్ చేయడానికి ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు.. అందులోనూ ప్రో సిరీస్ ఫోన్లు సరైన చాయిస్ అని పేర్కొన్నారు.
ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లను ఆపిల్ అట్టహాసంగా మార్కెట్లో ఆవిష్కరించడం వల్లే వాటికి గిరాకీ పెరిగినట్లు తెలుస్తున్నది. అందుకు భిన్నంగా హువావే తన మేట్ సిరీస్ ఫోన్లను సాదాసీదాగా మార్కెట్లోకి తేవడం కూడా దాని పట్ల గిరాకీ పెరగడం లేదని సమాచారం. ఎటువంటి ప్రీ-మార్కెటింగ్ ఈవెంట్ కూడా నిర్వహించని హువావే.. ఈ నెల 25న తన న్యూ స్మార్ట్ ఫోన్ హువావే మేట్ 60 సిరీస్ ఫోన్లతో ప్రయోజనాలపై ఓ ఈవెంట్ నిర్వహించనున్నదని తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

