ఈ ఫండ్స్‌లో 30% డివిడెండ్
స్టాక్ మార్కెట్లు, పోస్టాఫీస్ పథకాలు, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, కార్పొరేట్ డెట్ బాండ్స్ ఇలా వివిధ పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తూ.. ఎందులో నాలుగు రాళ్లు ఎక్కువొస్తాయో ఆలోచిస్తూంటారు మనలో చాలామంది. అయితే ఎంత ఆరాటపడినా ఒక్కోసారి పెద్దగా రిటర్న్స్ రావు. దీంతో చివరకు ద్రవ్యోల్బణాన్ని, బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ను బీట్చేసే లాభాలొచ్చినా చాలనుకుంటాం. కానీ ఆకర్షణీయ డివిడెండ్ ఇస్తూ.. ఎవరికీ పెద్దగా అవగాహన లేని కొన్ని ఫండ్స్ గురించి మీకు తెలుసా..? ఇప్పుడిప్పుడే ఇవి మంచి ఆదరణను పొందుతున్నాయి.
- డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ గురించి తెలుసా..
- మార్కెట్లో టాప్ డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్
- ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డివిడెండ్ ఈల్డ్ ఈక్విటీ ఫండ్
- టెంపుల్టన్ ఇండియా ఈక్విటీ ఇన్కమ్ ఫండ్
- ఆదిత్యా బిర్లా సన్ లైఫ్ డివిడెండ్ ఈల్డ్ ఫండ్
- హెచ్డీఎఫ్సీ డివిడెండ్ ఈల్డ్ ఫండ్
- యూటీఐ డివిడెండ్ ఈల్డ్ ఫండ్
- ప్రిన్సిపల్ డివిడెండ్ ఈల్డ్ ఫండ్
స్టాక్ మార్కెట్లు, పోస్టాఫీస్ పథకాలు, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, కార్పొరేట్ డెట్ బాండ్స్ ఇలా వివిధ పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తూ.. ఎందులో నాలుగు రాళ్లు ఎక్కువొస్తాయో ఆలోచిస్తూంటారు మనలో చాలామంది. అయితే ఎంత ఆరాటపడినా ఒక్కోసారి పెద్దగా రిటర్న్స్ రావు. దీంతో చివరకు ద్రవ్యోల్బణాన్ని, బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ను బీట్చేసే లాభాలొచ్చినా చాలనుకుంటాం. కానీ ఆకర్షణీయ డివిడెండ్ ఇస్తూ.. ఎవరికీ పెద్దగా అవగాహన లేని కొన్ని ఫండ్స్ గురించి మీకు తెలుసా..? ఇప్పుడిప్పుడే ఇవి మంచి ఆదరణను పొందుతున్నాయి. ఐదేండ్లుగా సుమారు 10 శాతం, మూడేండ్లుగా దాదాపు 30 శాతానికి తక్కువ కాకుండా లాభాలిస్తున్నాయి డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్. లాభాలతోపాటు ట్యాక్స్పరంగా కూడా కొద్దోగొప్పో ప్రయోజనాన్ని ఇవి అందజేస్తున్నాయి. అందుకే వీటిపై ఇన్వెస్టర్లలో ఆసక్తి కూడా క్రమేణా పెరుగుతున్నది.
స్టాక్స్ ట్రేడింగ్ నుంచి..
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈమధ్య ఒడిదుడుకులు పెరిగాయి. మూడేండ్ల ట్రాక్ రికార్డ్ చూస్తే.. కరోనా సమయంలో భారీగా పడి, ఆ తర్వాత అదే స్థాయిలో పెరిగి రికార్డుల మోత మోగించిన మార్కెట్లు.. ఇటీవల కాస్త స్థిరపడ్డాయి. ఇక వర్క్ ఫ్రం హోమ్ దాదాపుగా తగ్గిపోవడంతో రిటైల్ ఇన్వెస్టర్లలో ఆసక్తి కూడా సన్నగిల్లింది. గత 8 నెలలుగా స్టాక్ మార్కెట్ సూచీలు అక్కడక్కడే కొట్టుమిట్టాడుతూ రిటైల్ ఇన్వెస్టర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాయి మరి. ఈ నేపథ్యంలో డీమ్యాట్ ఖాతాల యాక్టివ్ సంఖ్య కూడా గణనీయంగా క్షీణించింది. సుమారు 60 లక్షల డీమ్యాట్ ఖాతాలు ఏడాదిగా ట్రేడింగ్ యాక్టివిటీని దాదాపు తగ్గించేశాయి. స్టాక్స్ ట్రేడింగ్‌ను పక్కనబెట్టి మ్యూచువల్ ఫండ్స్ వైపు ఆసక్తి చూపిస్తున్నారంతా. మ్యూచువల్ ఫండ్స్‌లోకి సిప్ పద్ధతి ద్వారా వచ్చే డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ ఎప్పటికప్పుడు రికార్డును సృష్టిస్తూనే ఉన్నాయి. స్థిరంగా డివిడెండ్‌ను ఇస్తూ ఆకర్షిస్తున్నాయి.
ఆదరణ పెరుగుతోంది
డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్‌కు రెండున్నర, మూడేండ్లుగా ఆదరణ పెరుగుతోంది. మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు మన పోర్ట్‌ఫోలియోపై అధిక ప్రభావం పడకుండా ఈ డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ అడ్డుకుంటాయి. ఎందుకంటే సాధారణంగా ఈ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోల్లో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) స్టాక్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బీపీసీఎల్, సెయిల్, భెల్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్, ఇంజినీర్స్ ఇండియా, కోల్ ఇండియా వంటి స్టాక్స్ ప్రధానంగా ఉంటాయి. గత రెండు త్రైమాసికాల్లో ఈ సంస్థలన్నీ మంచి లాభాలను కూడా నమోదు చేశాయి. దీనివల్ల స్టాక్ ధర పెరగడంతోపాటు డివిడెండ్ కూడా రావడం డబుల్ బోనస్ వంటిదే. గడిచిన దాదాపు రెండున్నరేండ్లలో డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్‌లోకి రూ.6,542 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇదే సమయంలో రూ.600 కోట్ల పెట్టుబడులే వెనక్కిపోయాయని భారతీయ మ్యూచువల్ ఫండ్స్ సంఘం (యాంఫీ) డాటా చెప్తున్నది.
పన్ను ప్రయోజనాలివి..
డివిడెండ్ ఈల్డ్ ఇచ్చే స్టాక్స్‌ను నేరుగా కొనడం కంటే ఇలా ఫండ్స్ ద్వారా కొనుగోలు చేయడం ఉత్తమం. దీనివల్ల పన్ను ప్రయోజనాలు అందుతాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎవరైనా 30 శాతం గరిష్ఠ శ్లాబుల్లో ఉంటే వాళ్లకు అదే స్థాయిలో పన్ను వర్తిస్తుంది. అదే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లాభాలొస్తే.. డివిడెండ్‌పై 10 శాతం మాత్రమే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను ఉంటుంది. కాబట్టి దీర్ఘకాల పెట్టుబడి ఆలోచన ఉన్నవారు, స్థిరంగా డివిడెండ్ రావాలనుకునేవారికి ఈ ఫండ్స్ ఉపయుక్తంగా ఉంటాయి.
-నాగేంద్ర సాయి కుందవరం
గమనిక: డివిడెండ్ ఈల్డ్ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి ఉంటాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టే ముందు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను పూర్తిగా చదివి నిర్ణయం తీసుకోవాలి. పైన పేర్కొన్న ఫండ్స్ వివరాలు మెజారిటీ మార్కెట్ విశ్లేషకుల అంచనాలు, వాటి ట్రేడింగ్ ఆధారంగా ఇస్తున్నవే. వీటిల్లో పెట్టుబడులకు ఈ కథనం రచయితగానీ, నమస్తే తెలంగాణ పత్రికగానీ ఏ రకమైన బాధ్యత వహించదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

