కరోనా ఎఫెక్ట్ : 2020-21లో జీడీపీ 7.3 శాతం తగ్గుదల

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఆర్థిక కార్యకలాపాలను దెబ్బతీయడంతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైన కారణంగా 2020-21లో దేశ జీడీపీపై ఆ ప్రభావం పడింది. 2021 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ ఏకంగా 7.3 శాతం పతనమైంది. ఆర్థిక సంవత్సరం చివరన జనవరి-మార్చి (నాలుగో త్రైమాసం)లో ఆర్థిక కార్యకలాపాలు కొంతమేర గాడినపడటంతో జీడీపీ 1.3 శాతం పెరిగిందని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.
కొవిడ్-19 విరుచుకుపడటంతో గత ఏడాది సుదీర్ఘ లాక్ డౌన్ లు, కఠిన నియంత్రణలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. టూరిజం, విమానయానం, వినోద, ఆతిథ్య రంగాలు సహా పలు రంగాలు కుదేలయ్యాయి. చిన్న మధ్యతరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వేలాది ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు చిరు వ్యాపారులు చితికిపోయారు. ఇక 2021-22 ఆర్థిక సంవత్సరంలో గత ఏడాదితో పోలిస్తే రెండంకెల ఆర్థిక వృద్ధి రేటు నమోదవుతుందనే అంచనాలు వెల్లడయ్యాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ ఆర్ధిక వ్యవస్థ రికవరీకి అడ్డుకట్ట వేస్తుందనే ఆందోళన రేకెత్తుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

