మరింత పెరిగిన విదేశీ మారక నిల్వలు
దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) వరుసగా మూడో వారమూ పెరిగాయి. డిసెంబర్ 22తో ముగిసిన వారంలో ఇవి మరో 4.47 బిలియన్ డాలర్ల మేర పెరిగి 620.44 బిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్టు రిజర్వ్‌బ్యాంక్ శుక్రవారం తెలిపింది. అంతక్రితం వారంలో ఇవి 9.11 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి.
ముంబై, డిసెంబర్ 29: దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) వరుసగా మూడో వారమూ పెరిగాయి. డిసెంబర్ 22తో ముగిసిన వారంలో ఇవి మరో 4.47 బిలియన్ డాలర్ల మేర పెరిగి 620.44 బిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్టు రిజర్వ్‌బ్యాంక్ శుక్రవారం తెలిపింది. అంతక్రితం వారంలో ఇవి 9.11 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి. 2021 అక్టోబర్‌లో 645 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయికి చేరిన తర్వాత మళ్లీ ఆ స్థాయికి నిల్వలు కోలుకోలేదు. ఒకదశలో ఇవి 520 బిలియన్ డాలర్ల వద్దకు పడిపోయాయి. అటుతర్వాత క్రమేపీ కోలుకుని రికార్డుస్థాయిని సమీపిస్తున్నాయి.
గత నెలరోజులుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) స్టాక్ మార్కెట్లో డాలర్లు కుమ్మరించడం ఫారెక్స్ నిల్వలు పెరగడానికి ప్రధాన కారణమని డీలర్లు తెలిపారు.ఈ ఏడాది మొత్తంమీద రిజర్వ్‌బ్యాంక్ 51.26 బిలియన్ డాలర్ల నిల్వల్ని పెంచుకుంది. ఈ డిసెంబర్ 22తో ముగిసిన వారంలో విదేశీ నిల్వల్లో అధికభాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు ఏకంగా 4.898 బిలియన్ డాలర్లు పెరిగి 549.75 బిలియన్ డాలర్లకు చేరాయి. డాలర్ మారకంలో వెల్లడించే విదేశీ కరెన్సీ ఆస్తుల్లో..అమెరికాయేతర కరెన్సీలయిన యూరో, పౌండ్, యెన్ల విలువల్లో ఏర్పడిన పెరుగుదల లేదా తరుగుదలను పరిగణనలోకి తీసుకుంటారు.
బంగారం నిల్వల్లో తరుగు
సమీక్షా వారంలో రిజర్వ్‌బ్యాంక్ వద్దనున్న బంగారం నిల్వలు మాత్రం తరిగిపోయాయి. ఇవి 107 మిలియన్ డాలర్ల మేర క్షీణించి 47.474 బిలియన్ డాలర్లకు తగ్గినట్టు ఆర్బీఐ తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 4 మిలియన్ డాలర్లు పెరిగి 18.33 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్ వద్ద ఉంచిన రిజర్వుల విలువ 129 మిలియన్ డాలర్లు తగ్గి 4.894 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

