మూడో నెలా క్షీణతే
భారత్ ఎగుమతులు వరుసగా మూడో నెలలోనూ క్షీణించాయి. 2023 ఏప్రిల్‌లో ఇవి అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 12.7 శాతం తగ్గి 34.66 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దిగుమతులు సైతం వరుసగా ఐదో నెలలోనూ తగ్గాయి.
- ఏప్రిల్‌లో భారీగా తగ్గిన ఎగుమతులు
- యూఎస్, యూరప్‌లో ఉత్పత్తులకు తగ్గిన డిమాండ్
- 20 నెలల కనిష్ఠానికి వాణిజ్య లోటు
హైదరాబాద్, మే 15: భారత్ ఎగుమతులు వరుసగా మూడో నెలలోనూ క్షీణించాయి. 2023 ఏప్రిల్‌లో ఇవి అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 12.7 శాతం తగ్గి 34.66 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దిగుమతులు సైతం వరుసగా ఐదో నెలలోనూ తగ్గాయి. ఏప్రిలో ఇవి 14 శాతం క్షీణించి 49.9 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఈ నేపథ్యంలో వాణిజ్యలోటు సైతం 20 నెలల కనిష్ఠస్థాయి 15.24 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2021 ఏప్రిల్ (15.10 బిలియన్ డాలర్లు) తర్వాత లోటు ఇంతటి కనిష్ఠానికి దిగిరావడం ఇదే ప్రధమం.
అమెరికా, యూరప్ దేశాల్లో వస్తూత్పత్తులకు డిమాండ్ సన్నగిల్లడంతో ఎగుమతులు తగ్గాయని, పరిస్థితి మెరుగుపడటానికి మరికొన్ని నెలలు పడుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ సారంగి సోమవారం మీడియాకు చెప్పారు. ‘యూరప్‌లో డిమాండ్ ఏమంత బాగా లేదు. యూఎస్‌లో సైతం గిరాకీ తగ్గుతున్నట్టు కన్పిస్తున్నది. వచ్చే రెండు నెలల్లో డిమాండ్ మెరుగుపడుతుందన్న ఆశాభావం లేదు’ అని డీజీఎఫ్టీ వ్యాఖ్యానించారు. అయితే కొవిడ్ తదుపరి చైనా ఆర్థిక వ్యవస్థ తెరుచుకోవడానికి తోడు, యూరప్, యూఎస్‌ల్లో సెప్టెంబర్ నుంచి డిమాండ్ పుంజుకుని ఎగుమతులు పెరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
జెమ్స్, జ్యువెల్లరీ డిమాండ్ తగ్గుదల
జెమ్స్, జ్యువెల్లరీ తదితర ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిందని సారంగి తెలిపారు. అయితే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నూనె గింజలు, వ్యవసాయోత్పత్తులకు ఎగుమతుల గిరాకీ అధికంగా ఉందని చెప్పారు. వచ్చే కొద్ది నెలల్లో జెమ్స్, జ్యువెల్లరీ, రెడీమేడ్ దుస్తులు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు తదితర ఎగుమతి రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని డీజీఎఫ్టీ వివరించారు. ఏప్రిల్ నెలలో పెట్రోలియం ఉత్పత్తులు, జెమ్స్, జ్యువెల్లరీ, ఇంజనీరింగ్ గూడ్స్, రసాయినాలు, రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు క్షీణించాయి. మరోవైపు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫార్మా, బియ్యం, నూనె గింజల ఎగుమతులు పెరిగాయి.
భారీగా తగ్గిన బంగారం దిగుమతులు
దిగుమతుల తగ్గుదలను సారంగి ప్రస్తావిస్తూ కమోడిటీ ధరలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని అన్నారు. ఏప్రిల్ నెలలో ముడి చమురు ఉత్పత్తులు 13.95 శాతం క్షీణించి 15.17 బిలియన్ డాలర్లకు చేరగా, బంగారం దిగుమతులు భారీగా 41.48 శాతం క్షీణించి 1 బిలియన్ డాలర్ల స్థాయికి తగ్గాయి.
యూఎస్‌కు ఎగుమతుల్లో 17 శాతం క్షీణత
అమెరికాకు భారత్ ఎగుమతులు 17.16 శాతం క్షీణించి 5.9 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఎగుమతులు 22 శాతం తగ్గి 2.23 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. భారత్ వాణిజ్యానికి కీలక దేశాలైన చైనా, సింగపూర్, బంగ్లాదేశ్, జర్మనీలకు కూడా ఎగుమతులు తగ్గాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

