ఐవోబీ లాభం 1,963 కోట్లు
ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.1,963 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.1,259 కోట్ల లాభంతో పోలిస్తే 56 శాతం ఎగబాకింది.
బెంగళూరు, అక్టోబర్ 26: ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.1,963 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.1,259 కోట్ల లాభంతో పోలిస్తే 56 శాతం ఎగబాకింది. బ్యాంక్ మొత్తం ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13 శాతం ఎగబాకి రూ.10,428 కోట్లకు చేరుకున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో అజయ్ కుమార్ శ్రీవాత్సవ తెలిపారు. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.19 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 0.16 శాతానికి దిగొచ్చింది. బ్యాంక్ డిపాజిట్లు రూ.4 లక్షల కోట్లకు, అడ్వాన్స్‌లు రూ.3.45 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

