Overseas Interest Rates | ఇతర బ్యాంకుల బాటలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రయాణిస్తున్నది. ఆర్బీఐ ఇటీవల రెపోరేట్ 40 బేసిక్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులు రెపోరేట్ ఆధారిత లెండింగ్ రేట్ల (వడ్డీరేటు)ను పెంచేశాయి.
అదే బాటలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రెపోరేట్ ఆధారిత లెండింగ్ రేట్లు పెంచేసింది. పెంచిన రేట్లు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.దీని ప్రకారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్ 7.25 శాతానికి పెరుగుతుందని సోమవారం తెలిపింది.
ఇంతకుముందు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కరూర్ వైశ్యాబ్యాంక్ కూడా తమ వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీనివల్ల ఇంటి రుణాలు మొదలు ఆటోమొబైల్ లోన్లు, పర్సనల్ లోన్లపై వడ్డీరేట్లు పెరుగుతాయి.