ప్రభుత్వ చర్యలు అంతంతే

- నిరుద్యోగంపై సరిగా స్పందించలేదు: మెకిన్సే
ముంబై, ఏప్రిల్ 6: కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో చాలా ఉద్యోగాలే పోయాయని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే తెలిపింది. ప్రభుత్వం మరిన్ని గట్టి చర్యలు చేపడితే నిరుద్యోగం ఇంతలా పెరిగిపోయేది కాదని అభిప్రాయపడింది. భారత వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మెకిన్సే సీనియర్ భాగస్వామి అలోక్ క్షీర్సాగర్ మాట్లాడుతూ.. బ్రిటన్‌లో ప్రభావవంతమైన చర్యలు తీసుకున్నారని, అందుకే అక్కడ ఉద్యోగాలు భద్రంగా ఉన్నాయన్నారు. కానీ భారత్‌లో సంఘటిత, అసంఘటిత రంగాల్లో కరోనా కారణంగా ఎన్నో ఉద్యోగాలు పోయాయన్నారు. మరోవైపు దేశంలో లాక్డౌన్ విధించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో టెక్నాలజీ రంగంలో ఉద్యోగావకాశాలపై ఆ ప్రభావం ఏమాత్రం లేదని ఓ నివేదిక తెలిపింది. కాగా, భారత వృద్ధికి క్యాపిటల్ మార్కెట్లే చోదక శక్తిలా పనిచేస్తాయని సీఐఐ అధ్యక్షుడు ఉదయ్ కొటక్ అన్నారు.
జీడీపీపై పెను ప్రభావం
దేశవ్యాప్తంగా నెల రోజులు లాక్డౌన్ విధిస్తే.. జీడీపీ 2 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేసింది. కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో వివిధ రాష్ర్టాలు పాక్షిక లాక్డౌన్ల వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఏ స్థాయిలో ఉంటుందో బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ చెప్పింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

