RBI-UPI Payments | డిజిటల్ చెల్లింపుల్లో భారత్ టాప్.. వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
RBI-UPI Payments | దేశీయంగా జరుగుతున్న ఆన్ లైన్ పేమెంట్స్ లో 80 శాతం యూపీఐ ద్వారా జరుగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.
RBI-UPI Payments | గత 12 ఏండ్లలో దేశంలో డిజిటల్ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సాగే మొత్తం ఆన్లైన్ పేమెంట్స్‌లో 49 శాతం మనదేశంలోనే జరుగుతున్నాయని ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన డిజిటల్ చెల్లింపుల అవగాహన సదస్సులో తెలిపారు.
‘2012-13లో దేశంలో 162 కోట్ల రిటైల్ చెల్లింపులు డిజిటల్ పేమెంట్స్ అయితే, 2023-24 నాటికి 14,726 కోట్లకు పెరిగింది. అంటే గత 12 ఏండ్లలో డిజిటల్ పేమెంట్స్ సుమారు 90 రెట్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్త డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు 49 శాతం భారత్‌లోనే సాగుతున్నాయి` అని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. యూపీఐ.. భారత్‌లో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన పేమెంట్స్ సిస్టమ్‌గా మారిందన్నారు.
`దేశీయంగా డిజిటల్ చెల్లింపుల్లో గణనీయమైన వృద్ధి నమోదు చేయడంలో యూపీఐ’దే కీలక పాత్ర. 2023లో జరిగిన ఆన్ లైన్ పేమెంట్స్‌లో 80 శాతం దీనిదే. 2017లో 43 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగ్గా, 2023 నాటికి అది 11,761 కోట్లకు పెరిగింది. రోజూ సగటున 43 కోట్ల యూపీఐ పేమెంట్స్ సాగుతున్నాయి’ అని శక్తికాంత దాస్ చెప్పారు.
ఆదాయం పన్ను పేమెంట్స్, బీమా ప్రీమియం చెల్లింపులు, మ్యూచువల్ ఫండ్ పేమెంట్స్, ఈ-కామర్స్ లావాదేవీలకు అత్యధికులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లిస్తారు. వీటి ప్రాసెసింగ్ కోసం బ్యాంకులు వేర్వేరుగా పేమెంట్స్ అగ్రిగేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ఖాతాదారులు ఈ తరహా పేమెంట్స్ చేయడానికి బ్యాంకులు, పేమెంట్స్ అగ్రిగేటర్ల మధ్య ఒప్పందం ఉండాలి. కానీ అన్నింటితో ఒప్పందాలు కుదుర్చుకోవడం అసాధ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణకు ఇంటరాపరెబుల్ పేమెంట్ సిస్టమ్ తేనున్నట్లు శక్తికాంత దాస్ చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

