SBI on Rs.2000 | ఐడీ అక్కర్లేదు.. ఫామ్ నింపాల్సిన పని లేదు.. రూ.2000 నోటు మార్పిడిపై ఎస్బీఐ కుండబద్ధలు!
SBI on Rs.2000 | రూ.2000 కరెన్సీ నోటు మార్పిడికి, బ్యాంకు శాఖల్లో డిపాజిట్ చేయడానికి ఏ ఐడీ కార్డు సమర్పించాల్సిన అవసరం లేదని ఎస్బీఐ తెలిపింది. ఏ ఫామ్ కూడా నింపాల్సిన పని లేదని స్పష్టం చేసింది.
SBI on Rs.2000 | మార్కెట్లో చలామణి నుంచి రూ.2000 కరెన్సీ నోటు ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. దీనిపై ప్రజల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో వదంతులు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్యబ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఆదివారం మార్గదర్శకాలు జారీ చేసింది. రూ.2000 కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి ఖాతాదారులు ఎటువంటి గుర్తింపు ధృవీకరణ పత్రం (ఐడీ) సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఏ పత్రం కూడా నింపవల్సిన పని లేదని పేర్కొంది. ఒకేసారి పది రూ.2000 కరెన్సీ నోట్లు మార్చుకోవచ్చునని తేల్చి చెప్పింది. ఈ విషయమై ఎస్బీఐ ఆపరేషన్స్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్ మురళీధరన్.. తమ బ్యాంకు శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.
రూ.2000 కరెన్సీ నోట్ల మార్పిడికి ఆధార్ కార్డు వంటి ఐడీ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి.. ఇంకా ఒక ఫామ్ నింపాల్సి ఉంటుందన్న వదంతులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో వాటికి ఎస్బీఐ నోటిఫికేషన్ చెక్ పెడుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతకుముందు శుక్రవారం `క్లీన్ నోట్ పాలసీ` కింద రూ.2000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ఈ నెల 19న ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే సెప్టెంబర్ 30 లోగా రూ.2000 కరెన్సీ నోట్లను ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడం గానీ, దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవడం గానీ చేయాలని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఆ తర్వాత కూడా రూ.2000 నోటు చెల్లుబాటవుతుందని కూడా ఆర్బీఐ వివరణ ఇచ్చింది.
గతంలో పాత పెద్ద నోట్లు (రూ.1000, రూ.500) రద్దు చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలో తాజాగా రూ.2000 కరెన్సీ నోటు చలామణి నుంచి తప్పిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించడంతో ప్రజల్లో పలు సందేహాలు, ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు తమ సమీపంలోని ఏ బ్యాంకు శాఖలోనైనా నోట్లు మార్చుకోవచ్చు.
ప్రజలు ఏ బ్యాంకు శాఖకైనా వెళ్లి, నేరుగా కౌంటర్లో రూ.2000 కరెన్సీ నోట్లు మార్చుకోవచ్చు. అందుకు ఆ బ్యాంకు శాఖలో సేవింగ్స్ ఖాతా ఉండాల్సిన అవసరం లేదు. ఆ బ్యాంకు శాఖలో ఖాతా ఉంటే, నేరుగా ఆ ఖాతాలో డిపాజిట్ చేయొచ్చు.
ఏ బ్యాంకు శాఖలోనైనా రూ.2000 కరెన్సీ నోట్లు.. రూ.20 వేల వరకు మార్చుకోవచ్చు. ఆ బ్యాంకు శాఖ ఖాతాదారులైతే ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయవచ్చు. కరెన్సీ నోట్ల మార్పిడికి, డిపాజిట్ చేయడానికి ఏ ఫీజు చెల్లించనవసరం లేదు. పూర్తిగా ఉచితంగా మార్చుకోవచ్చు. ఒకవేళ ఏ బ్యాంకు ఉద్యోగి అడిగినా సంబంధిత బ్యాంకు మేనేజర్‌కు గానీ, బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్‌కు గానీ ఫిర్యాదు చేయవచ్చు.
రూ.2000 కరెన్సీ నోట్లతో లావాదేవీలు జరుపొచ్చు. ఇతరుల నుంచి చెల్లింపులు స్వీకరించొచ్చు. అయితే, సెప్టెంబర్ 30 లోపు ఆ నోట్లను బ్యాంకులో డిపాజిట్ లేదా మార్చుకోవడం చేయాలి. రూ.2000 కరెన్సీ నోటు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ నిబంధన వర్తిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

