Hyundai Creta EV | జనవరి 17న హ్యుండాయ్ క్రెటా ఈవీ ఆవిష్కరణ.. ఇవీ డిటెయిల్స్..!
వచ్చేనెల భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో-2025లో జనవరి 17న తన పాపులర్ ఎస్యూవీ కారు హ్యుండాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV) ఖారు ఆవిష్కరించనున్నది.
Hyundai Creta EV | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) భారత్ మార్కెట్లో అత్యంత పాపులర్ మిడ్ సైజ్ ఎస్యూవీ కార్లు విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో-2025లో జనవరి 17న తన పాపులర్ ఎస్యూవీ కారు హ్యుండాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV) ఖారు ఆవిష్కరించనున్నది. మహీంద్రా బీఈ 6. (Mahindra BE6., టాటా కర్వ్.ఈవీ (Tata Curv.EV), ఎంజీ జడ్ఎస్ ఈవీ (MG ZS EV) వంటి కార్లకు హ్యుండాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV) గట్టి పోటీ ఇవ్వనున్నది. త్వరలో ఆవిష్కరించే మారుతి సుజుకి ఈ-విటారా (Maruti Suzuki e-Vitara), టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ (Toyoya Urban Cruiser EV) కార్లతో పోటీ పడుతుందీ హ్యుండాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV). హ్యుండాయ్ నుంచి వస్తున్న మూడో ఈవీ కారు ఇది. ఇంతకుముందు కొనా ఎలక్ట్రిక్ (Kona Electric), ఐయానిక్ 5 (Ioniq 5) తర్వాత వస్తున్న కారు క్రెటా ఈవీ. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ఫ్యాక్టరీలో క్రెటా ఈవీ కార్ల తయారీకి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) హ్యుండాయ్ క్రెటా మాదిరిగానే హ్యుండాయ్ క్రెటా ఈవీ కారులో క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్లె, రీ డిజైన్డ్ ఫ్రంట్ అండ్ రేర్ బంపర్స్, ఎయిరోడైనమికల్లీ డిజైన్డ్ అల్లాయ్ వీల్స్ ఉండవచ్చు. ఇంకా ట్విన్ 10.25 అంగుళాల డిస్ప్లేస్ ఫర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ డ్రైవర్ కన్సోల్, 360 – డిగ్రీ కెమెరా అండ్ వెంటిలేటెడ్ సీట్స్‌తోపాటు 2 అడాస్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. 50కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటదని సమాచారం. సింగిల్ చార్జింగ్ సాయంతో 450-500 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. ఈ కారుకు ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ వెసులుబాటు కూడా ఉంటుంది. దీని ధర రూ.18 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం కానున్నదని అంచనా.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

