ఎల్ఐసీ ఐపీవోకు దరఖాస్తు చేసుకోవడమెలా?
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ఈ బుధవారమే మార్కెట్లోకి వస్తున్నది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఎల్ఐసీలో మదుపు చేసేందుకు సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్ మదుపరులు, పాలసీదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
- ఎవరెవరికి ఏయే ప్రయోజనాలు
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ఈ బుధవారమే మార్కెట్లోకి వస్తున్నది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఎల్ఐసీలో మదుపు చేసేందుకు సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్ మదుపరులు, పాలసీదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పెన్షన్ ఫండ్లు కూడా మదుపు చేసేందుకు వీలుగా పీఎఫ్ఆర్డీఏ అనుమతి ఇచ్చింది. 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.21,000 కోట్ల ఈ ఐపీవోలో షేర్ల ధరను రూ.902-949గా నిర్ణయించారు. ఎల్ఐసీ పాలసీదారులకు 10 శాతం షేర్లను, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లను రిజర్వ్ చేశారు. ఉద్యోగుల కోసం 0.71 శాతం షేర్లను సిద్ధం చేయగా, దేశీయంగా ఇప్పటిదాకా వచ్చిన ఐపీవోల్లో ఇదే పెద్దది.
డిస్కౌంట్-మదుపు ఎంతెంత?
పాలసీదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు, ఎల్ఐసీ ఉద్యోగులు గరిష్ఠంగా రూ.2 లక్షలకు మించి మదుపు చేయడానికి లేదు. అయితే మీరు అన్ని కేటగిరిల్లోనూ దరఖాస్తు చేయాలనుకుంటే రూ.6 లక్షల వరకు మదుపు చేయవచ్చు. ఒకవేళ ఎల్ఐసీ ఉద్యోగి కానైట్టెతే రిటైల్ ఇన్వెస్టర్, పాలసీదారుని కోటాలో రూ.4 లక్షల వరకు దరఖాస్తు చేయవచ్చు. ఇక పాలసీదారుడైతే ఒక్కో షేర్‌పై రూ.60, రిటైల్ ఇన్వెస్టర్‌కు, ఎల్ఐసీ ఉద్యోగికి రూ.45 చొప్పున డిస్కౌంట్ ఉంటుంది. అయితే ఎల్ఐసీ పాలసీని ఈ ఏడాది ఫిబ్రవరి 13లోపు తీసుకున్నవారికి మాత్రమే పాలసీదారు కోటా, డిస్కౌంట్లు వర్తిస్తాయి. యాన్యునిటీ పాలసీదారు దరఖాస్తు చేసుకోవచ్చుగానీ ఈ ప్రయోజనాలు వర్తించవు. అలాగే పాలసీని ఫిబ్రవరి 28లోపే పాన్ కార్డ్‌తో లింక్ చేసి ఉండాలి. కాగా, సంస్థాగతేతర మదుపరిగా కూడా ఇంకా అధిక మొత్తానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే రిటైల్ ఇన్వెస్టర్, పాలసీదారు రిజర్వేషన్ల ప్రయోజనాలను వదులుకోవాల్సి ఉంటుంది. రెండింటిలోనూ దరఖాస్తు చేస్తే రెండూ తిరస్కరిస్తారు. హై నెట్‌వర్త్ ఇన్వెస్టర్ల కోసం ఈ కేటగిరిని సృష్టించారు. అలాగే అవిభాజ్య హిందు కుటుంబం ఎన్నారైలూ రిటైల్ ఇన్వెస్టర్ల కేటగిరి కిందకే వస్తారు. వీరికి కూడా రూ.45 డిస్కౌంట్ వర్తిస్తుంది.
మదుపు చేయడం ఎలా?
యాంకర్ ఇన్వెస్టర్లు మినహా మిగతా కేటగిరి ఇన్వెస్టర్లంతా తప్పనిసరిగా ఏఎస్బీఏ పద్ధతితోనే పబ్లిక్ ఇష్యూకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. బిడ్ కమ్ అప్లికేషన్ ద్వారా సెల్ఫ్ సర్టిఫైడ్ సిండికేట్ బ్యాంక్‌తో ఐపీవో దరఖాస్తుకు అవసరమైన మొత్తాన్ని బ్లాక్ చేస్తారు. బ్యాంక్ నుంచి దరఖాస్తు సొమ్మును అలాట్మెంట్ పూర్తయిన తర్వాత మినహాయించుకుంటారు. అలాగే యూపీఐ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే యూపీఐలో మీ డీపాజిటరీ ఐడీ, క్లయింట్ ఐడీ, యూపీఐ ఐడీ, పాన్ నెంబర్లు లేకపోతే తిరస్కరిస్తారు. మీరు మరొకరి యూపీఐ ఐడీ లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలనూ ఇవ్వడానికి వీల్లేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

