TDS on Crypto Assets | క్రిప్టో లావాదేవీలపై టీడీఎస్ మినహాయింపు.. నేటి నుంచి అమలు!
TDS on Crypto Assets | క్రిప్టో కరెన్సీ అసెట్స్ లావాదేవీలపై జూలై ఒకటో తేదీ నుంచి ప్రతి ఒక్కరూ టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.
TDS on Crypto Assets | క్రిప్టో కరెన్సీలు.. వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏ)పై టీడీఎస్ మినహాయింపులు అమలు చేసేందుకు ఆదాయం పన్ను (ఐటీ) శాఖ రంగం సిద్ధం చేసింది. దీని ప్రకారం క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లు.. తమ ఖాతాదారులకు వర్చువల్ డిజిటల్ అసెట్స్ ట్రాన్స్ఫర్, పేమెంట్ పాలసీ తదితర వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 వేలకు పైగా క్రిప్టో కరెన్సీ చెల్లింపులపై ఒకశాతం టీడీఎస్ మినహాయిస్తారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆదాయం పన్నుశాఖ తెలిపింది. ఇందుకోసం ఐటీ రూల్స్‌లో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సవరణలు తీసుకొచ్చింది. ఈ నెల 22న సర్క్యులర్ జారీ చేసింది.
సవరించిన ఐటీ రూల్స్ ప్రకారం క్రిప్టో ఇన్వెస్టర్లు తమ లావాదేవీలకు సంబంధించి ఫామ్- 26క్యూఇ, ఫామ్- 16ఇ కింద టీడీఎస్ రిటర్న్ దాఖలు చేయాలి. ఆదాయం పన్నుచట్టంలోని 194 ఎస్ సెక్షన్ కింద మినహాయించిన టీడీఎస్‌ను అదే నెలాఖరు నుంచి 30 రోజుల్లో ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి. ఈ సొమ్ము డిపాజిట్ కోసం 26క్యుఇ ఫామ్ కింద చలాన్ కం స్టేట్మెంట్ వాడాలి. దీనిపై తలెత్తే సందేహాలను నివృత్తి చేస్తూ ఆదాయం పన్ను శాఖ.. ఎఫ్ఏక్యూ కూడా జారీ చేసింది.
ఈ ఫామ్‌ల్లో ఇచ్చిన సమాచారం ప్రకారం క్రిప్టో కరెన్సీ అసెట్స్ నికర లావాదేవీల విలువపై టీడీఎస్ విధిస్తారు. వివిధ క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు సంబంధించిన పన్నును వాటి ఎక్స్చేంజ్లే వసూలు చేయాల్సి ఉంటుంది. క్రిప్టో కరెన్సీ అసెట్స్ విక్రయదారులు, కొనుగోలుదారులు ప్రత్యక్షంగా జరిపే లావాదేవీలు, క్రిప్టోల కొనుగోలుదారులు జరిపే పేమెంట్స్ అన్నీ టీడీఎస్ పరిధిలోకే వస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

