హెచ్డీఎఫ్సీ రుణాలు ప్రియం
హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ రుణాలు మరింత ప్రియం కానున్నాయి. గృహ రుణాలపై బెంచ్‌మార్క్ వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్లు (0.3 శాతం) పెంచుతున్నట్టు సంస్థ శనివారం ప్రకటించింది.
- 30 బేసిస్ పాయింట్లు పెంచిన సంస్థ
న్యూఢిల్లీ, మే 7: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ రుణాలు మరింత ప్రియం కానున్నాయి. గృహ రుణాలపై బెంచ్‌మార్క్ వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్లు (0.3 శాతం) పెంచుతున్నట్టు సంస్థ శనివారం ప్రకటించింది. దీంతో ప్రస్తుత రుణ గ్రహీతలతో పాటు కొత్తవారికీ రుణాలు మరింత ఖరీదవుతాయి. ప్రస్తుత రుణగ్రస్తుల ఈఎంఐలు పెరుగుతాయి.
రిజర్వ్‌బ్యాంక్ హఠాత్తుగా రెపో రేటును పెంచిన వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంక్‌లు రేట్లను వడ్డించిన నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ ప్రకటన వెలువడింది. తమ గృహ రుణాల రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్) 30 బేసిస్ పాయింట్లు పెంచుతున్నామని, కొత్త రేట్లు మే 9 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ తెలిపింది. రుణ మొత్తం, కాలపరిమితినిబట్టి కొత్త వడ్డీ రేట్లు 7 శాతం నుంచి 7.45 శాతం వరకూ ఉంటాయి. ప్రస్తుతం అవి 6.70 శాతం నుంచి 7.15 శాతం వరకూ ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలోనే హెచ్డీఎఫ్సీ తన బెంచ్ మార్క్ రుణ రేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచింది.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

