Home Loans | వడ్డీరేట్లు డోంట్‌కేర్.. ఇండ్ల రుణాలకు ఫుల్ గిరాకీ.. తేల్చేసిన హెచ్డీఎఫ్సీ
Home Loans | వడ్డీరేట్లు పెంచినా ఇండ్ల రుణాలకు డిమాండ్ తగ్గలేదు. మున్ముందు పుంజుకుంటుందని హెచ్డీఎఫ్సీ సీఈవో కేకీ మిస్త్రీ తేల్చేశారు.
Home Loans | ఇండ్ల రుణాలకు వచ్చే కొన్ని నెలల పాటు డిమాండ్ ఉంటుందని అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ.. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) అంచనా వేసింది. ఇండ్ల ధరలు ఒకవేళ స్వల్పంగా ఎక్కువగా ఉన్నా చౌక ధరకు ఇండ్లు కొనుగోలు చేసే వారికి సౌలభ్యంగానే ఉందని హెచ్డీఎఫ్సీ సీఈవో కేకి మిస్త్రీ చెప్పారు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ బాగా ఉందన్నారు.అధిక ధరలను కట్టడి చేయడానికి గత మూడు నెలల్లో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు 140 బేసిక్ పాయింట్లు పెంచేసింది. ఇప్పటికీ రిటైల్ ద్రవ్యోల్భణం.. ఆర్బీఐ సౌలభ్య స్థాయికి ఎగువనే కొనసాగుతున్నది. వచ్చే మార్చి (2023) నాటికి ఆర్బీఐ కనీసం 60 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి.
రెపోరేట్ పెంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బ్యాంకులు వడ్డీరేట్లు పెంచినా.. ఇండ్ల కొనుగోలు దారులపై ఎటువంటి ఒత్తిడి లేదన్నారు కేకీ మిస్త్రీ. సొంతింటి కల సాకారం కావాలని భావించే వారు తీసుకునే ఇండ్ల రుణాలు పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ బలంగా ఉందన్నారు. ప్రస్తుత పండుగల సీజన్ (సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు)లో మరింత బలంగా ఉంటుందని అన్నారు.
`భారీస్థాయిలో వడ్డీరేట్లు పెరుగుతాయని నేను భావించట్లేదు. కొంత వడ్డీరేటు పెరిగినా, ఇండ్ల కొనుగోలుదారులను నిరుత్సాహ పరుస్తుందని అనుకోవడంలేదు` అని కేకీ మిస్త్రీ చెప్పారు. ఇండ్ల కొనుగోలుదారులు ఆర్బీఐ రెపోరేట్‌కు అనుగుణంగా వడ్డీరేట్ల పెరుగుదలకు సిద్ధం అవుతారని గత నెలలో సమర్పించిన నివేదికలో బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మోహన్ సబ్నావిస్ స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే జూలై నెలలో ఇండ్ల రుణాలు 16 శాతం పెరిగాయి. పెద్ద నగరాల్లో సొంతిండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రధాన మెట్రో పాలిటన్ సిటీస్‌లో 2016-2020 మధ్య ఇండ్ల విక్రయాలు నెమ్మదించాయి. పరిస్థితి తారుమారై.. ఇప్పుడు ఇండ్ల కొనుగోళ్లు పెరుగుతాయని మిస్త్రీ పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

