ఓటీటీకి లైసెన్స్.. మెసేజింగ్ యాప్‌లకూ.. అందుకేనా?!
Messaging Apps Licence | ఓటీటీ, వీడియో కాలింగ్ ప్లస్ మెసేజింగ్ యాప్స్ ఇక ఆ సేవలకు లైసెన్స్ తెచ్చుకోవాలి. ముసాయిదా కేంద్రం విడుదల చేసింది.
Messaging Apps Licence | కరోనా పుణ్యమా? అని ఇప్పుడందరూ అన్ని భాషల సినిమాలు వీక్షిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా తెలుసుకోగలుగుతున్నారు.. అంతకుముందే వాడుకలోకి వచ్చినా కరోనా మహమ్మారి తర్వాత ఓటీటీ ప్లాట్ ఫామ్స్, మెసేజింగ్ అండ్ కాలింగ్ సేవలందిస్తున్న యాప్‌లు ఇక నేరుగా ఆ సేవలందించడం కుదరదు. ఇప్పటికే ఓటీటీ సేవలందిస్తున్న అమెజాన్ ఫ్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు.. మెసేజింగ్ కం వీడియో కాల్స్ తదితర సేవలందిస్తున్న వాట్సాప్, జూమ్, గూగుల్ డ్యూ వంటి యాప్‌లు ఇక ఆ సేవలందించాలంటే టెలీ కమ్యూనికేషన్స్ శాఖ వద్ద లైసెన్స్ తీసుకోవాల్సిందే.ఈ విషయమై కేంద్రం టెలీ కమ్యూనికేషన్స్ బిల్లు-2022 ముసాయిదాను విడుదల చేసింది. దీన్ని కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ బిల్లు ప్రకారం టెలికం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఫీజు మాఫీ చేయొచ్చు. పెనాల్టీ విధించే అధికారం కేంద్రానికి దక్కుతుంది. ఏదైనా సంస్థ తమ లైసెన్స్ సరెండర్ చేస్తే సంబంధిత సంస్థ యాజమాన్యం చెల్లించిన ఫీజు రీఫండ్ చేస్తామని కూడా ముసాయిదా బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. ఈ ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలను వచ్చేనెల 20 లోగా తెలియజేయాలని కోరింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం ఇంటర్నెట్ సర్వీస్, ఓటీటీ, మెసేజింగ్ కం వీడియో కాలింగ్ సేవలందిస్తున్న యాప్‌లకు లైసెన్స్ ఇవ్వడానికి ఎంట్రీ ఫీజు, లైసెన్స్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర ఫీజులు, చార్జీలు, అదనపు చార్జీలు, పెనాల్టీ విధించొచ్చు. ఆయా చార్జీలు, ఫీజులు, పెనాల్టీలు రద్దు చేసే అధికారం కేంద్రానికి లభిస్తుంది.
లైసెన్సింగ్ పేరిట ఓటీటీ, మెసేజింగ్ యాప్స్‌కు కళ్లెం వేసేందుకు కేంద్రం సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తున్నది. ఏ మెసేజ్ అయినా సంబంధిత అధికారి అనుమతి వచ్చిన తర్వాత ట్రాన్స్ మీట్ చేయాలని ముసాయిదా నిబంధనలు చెబుతున్నాయి. లేని పక్షంలో సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి పబ్లిక్ ఎమర్జెన్సీ, పబ్లిక్ సేఫ్టీ, స్వావలంభన, సమగ్రత, దేశ భద్రత తదితర అంశాల నుంచి మినహాయింపులు ఇవ్వలేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

