Gold price : దేశీయ మార్కెట్లో బంగారం ధరలు (Gold price) బుధవారం స్వల్పంగా పుంజుకున్నాయి. క్రితం రోజు తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు ఇవాళ తిరిగి కోలుకున్నాయి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,42,050 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,30,210గా నమోదైంది.
ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,06,540 వద్ద ఉంది. నిజామాబాద్, ఖమ్మం వంటి పట్టణాల్లోనూ ఇవే ధరలు అమలవుతున్నాయి. ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే చెన్నైలో పసిడి ధరలు కాస్త అధికంగా ఉన్నాయి. అక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,990 పలికింది. ముంబై, ఢిల్లీ, కోల్కతా వంటి మెట్రో నగరాల్లో ధరలు రూ.1,42,050 నుంచి రూ.1,42,200 మధ్య స్వల్ప వ్యత్యాసాలతో ట్రేడవుతున్నాయి.