అలాగైతే 35 వేల ఉద్యోగాలు హుష్‌కాకి.. రూ.28 వేల కోట్ల రుణాలు గోవిందా?!
అలాగైతే 35 వేల ఉద్యోగాలు హుష్‌కాకి.. | గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు వ్యతిరేకంగా ఫ్యూచర్ రిటైల్ మళ్లీ సుప్రీంకోర్టు తలుపు ....

న్యూఢిల్లీ: గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు వ్యతిరేకంగా ఫ్యూచర్ రిటైల్ మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు అత్యవసర ఆదేశాలను అమలు చేస్తే సంస్థలోని 35,575 మంది ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిశోర్ బియానీ సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు.
రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు గతేడాది అక్టోబర్‌లో జారీ చేసిన అత్యవసర ఆదేశాల్లో పేర్కొంది. భారత్‌లో సింగపూర్ కోర్టు ఆదేశాలు అమలవుతాయని ఇటీవల సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు.. తమ ఆదేశాలపై దిగువ కోర్టుకు వెళ్లొద్దని ఫ్యూచర్ గ్రూప్‌ను హెచ్చరించింది.
ఇలా సుప్రీంకోర్టులో సమీక్షా పిటిషన్
సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సమీక్షా పిటిషన్ దాఖలు చేసింది ఫ్యూచర్ గ్రూప్. ఇది అత్యవసరంగా విచారించాల్సిన పిటిషన్ అని ఆ సంస్థ తరఫు న్యాయవాది యుగంధర పవార్ ఝా పేర్కొన్నారు. రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ విలీనం జరుగకపోతే రూ. 28 వేల కోట్ల బ్యాంకు రుణాలు, డిబెంచర్ల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందన్నారు. తమ సంస్థకు ఊహించని నష్టం జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టులో ఫ్యూచర్ గ్రూప్ సమీక్షా పిటిషన్ విషయమై అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ అధికార ప్రతినిధులు స్పందించడానికి నిరాకరించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

