ముంబై: దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో వృద్ధిరేటు కొనసాగుతున్నది. నవంబర్ 25తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 2.89 బిలియన్ డాలర్ల వృద్ధితో 550.14 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారం అంటే నవంబర్ 18తో ముగిసిన వారంలో దేశంలో విదేశీ మారక నిల్వలు 547.25 బిలియన్ డాలర్లు ఉన్నాయి.
కాగా, విదేశీ మారక నిల్వల్లో గత మూడు వారాల నుంచి వరుసగా వృద్ధి రేటు కనిపిస్తున్నది. అయితే విదేశీ మారక నిల్వల్లో మూడు వారాల నుంచి వరుసగా వృద్ధి నమోదవుతున్నా.. బంగారం నిల్వలు మాత్రం భారీగా తగ్గిపోతున్నాయి. నవంబర్ 25తో ముగిసిన గత వారంలో బంగారం నిల్వలు 73 మిలియన్ డాలర్లు తగ్గి 39.93 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
కాగా, గత అక్టోబర్లో విదేశీ మారక నిల్వలు వేగంగా తగ్గిపోయాయి. 524 బిలియన్ డాలర్లకు తగ్గి రెండేళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.