Gold Smuggling | రూ.4.14 కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్.. ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన కస్టమ్స్..!
Gold Smuggling | దుబాయ్, షార్జాల నుంచి వేర్వేరు విమానాల్లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు మహిళలు సహా ఆరుగురు వ్యక్తులను ఢిల్లీ, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ బంగారం విలువ రూ.4.14 కోట్లు ఉంటుందని తెలిపారు.
Gold Smuggling | విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తున్న ఇద్దరు మహిళలు సహా ఆరుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు వేర్వేరుగా అదుపులోకి తీసుకున్నారు. గత నెల 30న ఒక మహిళ సహా ఐదుగురు అజర్బైజాన్ పౌరులు దుబాయ్ నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చారు. వారిని కస్టమ్స్ అధికారులు వ్యక్తిగతంగా తనిఖీ చేసినప్పుడు బంగారం ఆభరణాలు బయట పడ్డాయి. వైర్, బెల్ట్ బకిల్, హ్యాండ్ బ్యాగ్ హ్యాండిల్ తదితర వస్తువుల రూపంలో 3.5 కిలోల బంగారం వారు స్మగ్లింగ్ చేస్తున్నారని కస్టమ్స్ అధికారులు తెలిపారు. వారి వద్ద స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.2.44 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఐదుగురు అజర్ బైజాన్ పౌరులను అరెస్ట్ చేశామని వెల్లడించాు.
చెన్నైలో రూ.1.07 కోట్ల విలువైన బంగారం జప్తు
ఇటీవల షార్జా నుంచి వచ్చిన విమానంలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలి వద్ద నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.1.07 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు శుక్రవారం తెలిపారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఈ నెల ఒకటో తేదీన చెన్నై విమానాశ్రయం ఇంటర్నేషనల్ టర్మినల్ వద్ద సదరు ప్రయాణికురాలిని తనిఖీ చేసి, బంగారం జప్తు చేశామని తెలిపింది. ఆమె తన లోదుస్తులు, పేస్ట్ రూపంలోనూ 1.69 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారని పేర్కొంది. ఆమెను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

