ఫాబియెన్స్ మెగా ఫర్నిచర్ ప్లాంట్
హైదరాబాద్ కేంద్రస్థానంగా పనిచేస్తున్న ప్రముఖ ప్రీమియం ఫర్నిచర్ తయారీ సంస్థ ఫాబియెన్స్..తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. నగరానికి సమీపంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడితో 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పుతున్న ఈ ప్లాంట్ వచ్చే ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ ఎండీ రాజ్ వేణుగోపాల్ తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 9: హైదరాబాద్ కేంద్రస్థానంగా పనిచేస్తున్న ప్రముఖ ప్రీమియం ఫర్నిచర్ తయారీ సంస్థ ఫాబియెన్స్..తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. నగరానికి సమీపంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడితో 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పుతున్న ఈ ప్లాంట్ వచ్చే ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ ఎండీ రాజ్ వేణుగోపాల్ తెలిపారు. ఈ యూనిట్ ఏర్పాటుతో కొత్తగా 100 మందికిపైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.
ఈ యూనిట్లో తయారుకానున్న ఉత్పత్తులను దేశీయంగా విక్రయించడంతోపాటు ఇతర దేశాలకు ఎగుమతి చేసే ఆలోచన కూడా ఉన్నదన్నారు. 2018లో ప్రారంభమైన సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌లో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 200 మంది ఉపాధి అవకాశాలు కల్పించిన యూనిట్‌ను నిర్వహిస్తున్నది. ప్రస్తుతం భారత్‌లో ఫర్నిచర్ మార్కెట్ విలువ 31.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

