Hero Electric | నిమిషాల్లో చార్జింగ్.. ఆ బైక్ బ్యాటరీ లైఫ్ 10 ఏండ్లు!
Hero Electric | విద్యుత్ వెహికల్స్ తయారీలో హీరో ఎలక్ట్రిక్.. 15 నిమిషాల్లోనే చార్జింగ్ అయ్యే బ్యాటరీపై ఫోకస్ చేస్తున్నది.

Hero Electric | భగభగమండుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ఇప్పుడంతా ఆల్టర్నేటివ్గా ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, బైక్‌ల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సంప్రదాయ టూ వీలర్స్ సంస్థలు మొదలు స్టార్టప్ సంస్థల వరకు పలు సంస్థలు ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో తమ వాటా పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ దిశగానే హీరో ఎలక్ట్రిక్ ప్రయాణిస్తున్నది. ఓలా, ఎథేర్ వంటి సంస్థలు ఇప్పటికే విపణిలో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించాయి.
ఇక హీరో మోటో కార్ప్స్ అనుబంధ హీరో ఎలక్ట్రిక్.. కేవలం 15 నిమిషాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్ పూర్తి చేసే సామర్థ్యం గల బ్యాటరీల తయారీపై కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న లాగ్-9 కంపెనీతో జత కట్టింది. రాపిడ్ ఎక్స్ బ్యాటరీ పాక్‌తో హీరో లాగ్-9 ఇన్‌స్టా చార్జింగ్ నిర్వహిస్తుంది. ఈ పరికరంతో హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు 15 నిమిషాల్లో చార్జింగ్ అవుతాయి.
లాగ్9 ఇన్‌స్టా చార్జింగ్ ప్యాక్‌కు పదేండ్లకు పైగా లైఫ్ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం ఉండటంతోపాటు క్విక్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. రాపిడ్ ఎక్స్ బ్యాటరీలను 30-60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య వాడొచ్చు. ఈ బ్యాటరీలు పూర్తిగా సేఫ్టీ ఫీచర్లతో తయారు చేస్తున్నారు. ఉష్ణోగ్రత పెరిగినా ఈ పరికరం అగ్ని ప్రమాదానికి గురి కాదని నిపుణులు చెబుతున్నారు.
హీరో ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియో బైక్‌లు, స్కూటర్ల వినియోగదారులు ఒక కప్ టీ తాగే లోపు వాటి బ్యాటరీలను చార్జీ చేసుకోవచ్చు. వారి ఆఫీసులో గానీ, అపార్ట్మెంట్లోగానీ చార్జి చేసుకునేందుకు వీలుగా పోర్టబుల్ బ్యాటరీలు కూడా అందజేస్తారు. వాహన డ్రైవర్లు కప్ టీ తాగేలోపు బ్యాటరీ పూర్తిగా చార్జి అవుతుంది. తాము లాగ్ 9 బ్యాటరీస్ సంస్థతో కలిసి నూతన తరం బైక్‌లను ఆవిష్కరిస్తామన్నారు. అవి శరవేగంగా చార్జి అవుతాయన్నారు. కానీ, తాము విడుదల చేసే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల ధర వెల్లడించలేదు.
అయితే ఫాస్ట్ చార్జింగ్ వల్ల ఓ ప్రాబ్లం ఉంది. సదరు ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ దెబ్బతినే అవకాశం ఉంది. కనుక చార్జింగ్ ఎక్కువ టైం కేటాయించడం తప్పనిసరి కానున్నదని పేర్కొంటూ ఎలక్ట్రోకెమికల్ సొసైటీ జర్నల్‌లో వార్తా కథనం ప్రచురితమైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- hero electric
- log9
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

