Home Loan EMI Raise | ఆ 3 బ్యాంకుల ఇండ్ల రుణాలపై ఈఎంఐ భారం పైపైకి.. ఎందుకంటే?!
Home Loan EMI Raise | పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ రుణాలపై నెలవారీ వాయిదాలు భారం కానున్నాయి.
Home Loan EMI Raise | దేశంలోనే అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్డీఎఫ్సీ)తోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రుణ వాయిదాల భారం పెరుగనున్నది. ఇండ్ల రుణాలు మొదలు కార్లు-బైక్‌లు, పర్సనల్ లోన్లు, వ్యాపార రుణాల వరకు అన్ని రకాల లోన్ల రుణ వాయిదాల భారం పెరుగుతుంది. హెచ్డీఎస్సీ బుధవారం నుంచి బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ 5 బేసిక్ పాయింట్లు పెంచేసింది. గత నెల ప్రారంభంలో 40 బేసిక్ పాయింట్లు రెపొరేట్ పెంచినప్పటి నుంచి హెచ్డీఎఫ్సీ వడ్డీరేటు పెంచడం ఇది మూడోసారి. తాజా ఐదు బేసిక్ పాయింట్ల వడ్డీరేటు పెంపుతో హెచ్డీఎఫ్సీ వడ్డీరేటు 40 బేసిక్ పాయింట్లు (0.4 %) పెంచినట్లయింది.
ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా తమ మార్జిన్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసీఎల్ఆర్) పెంచాయి. పీఎన్బీ జూన్ ఒకటో తేదీ నుంచి మార్చినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ 15 బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కూడా బుధవారం (జూన్ 1) నుంచి ఎంసీఎల్ఆర్ పెంచామని తెలిపింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం కొంత టెన్యూర్ గల రుణాలపై ఎంసీఎల్ఆర్ బుధవారం నుంచి పెంచి వేసింది. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కూడా అన్ని రకాల టెన్యూర్ రుణాలపై ఎంసీఎల్ఆర్ పెంచాయి. ఇప్పటికే ఫ్లోటింగ్ వడ్డీరేట్ల ప్రాతిపదికన తీసుకున్న రుణాలపై ఎంసీఎల్ఆర్ లేదా ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్- బేస్డ్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్) లేదా బేస్ రేట్ పెరుగుతుంది.
బేస్ ఇంటరెస్ట్ రేట్ సిస్టమ్‌కు ఆల్టర్నేటివ్గా ఎంసీఎల్ఆర్ విధానాన్ని ఆర్బీఐ తీసుకువచ్చింది. ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ వడ్డీకి బ్యాంకులు రుణాలివ్వరాదు. రుణ గడువును బట్టి ఎంసీఎల్ఆర్లో తేడా ఉంటుంది. తక్షణం నుంచి మూడేండ్ల వరకు ( overnight to three years ) టెన్యూర్ గల రుణాలపై వేర్వేరుగా వడ్డీరేట్లు వర్తిస్తాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణానికి దారి తీసింది. ఈ ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయడానికి ఆర్బీఐ గత నెల ప్రారంభంలో రెపోరేట్ 40 బేసిక్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- banks
- home loans
- lending rates
- rbi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

