Rs 2000 Effect | రూ.2000 నోట్ల ఎఫెక్ట్.. వాళ్లకు సెలవులు రద్దు.. ఇక రోజుకు 11 గంటల డ్యూటీ !
Rs 2000 Effect | రూ.2000 కరెన్సీ నోటు విత్ డ్రా నిర్ణయంతో దేవాస్ లోని బ్యాంకు నోటు ప్రెస్ లో ఆదివారం సెలవు రద్దు చేశారు.
Rs 2000 Effect | మార్కెట్లో చలామణి నుంచి రూ.2000 కరెన్సీ నోటు ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. ఆ కరెన్సీ నోట్లు కల వారు సెప్టెంబర్ 30 లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని తెలిపింది. ఆర్బీఐ తాజా నిర్ణయం ప్రభావం నేరుగా మధ్య ప్రదేశ్‌లోని దేవాస్ బ్యాంక్ నోట్ ప్రెస్ (BNP)పై పడింది. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు ఆదివారం సెలవు. కానీ బీఎన్పీ యాజమాన్యం ‘ఆదివారం’ సెలవు రద్దు చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ప్రతి రోజూ రూ.500 కరెన్సీ నోట్లు ‘2.20 కోట్ల నోట్లు’ ముద్రించాల్సి ఉంటుంది. ఇందుకోసం బీఎన్పీ ఉద్యోగులు ప్రతి రోజూ 22 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఒక్కో షిఫ్ట్‌కు 11 గంటల వంతున రెండు షిఫ్ట్‌ల్లో బీఎన్పీ ఉద్యోగులు పని చేయాల్సి ఉంటది. ఇప్పుడు 9-9 గంటల షిఫ్ట్‌ల్లో పని చేస్తున్నారు.
బ్యాంకు నోట్ ప్రెస్ (బీఎన్పీ)లో 500, 200, 100, 50, 20 కరెన్సీ నోట్లు ముద్రిస్తున్నారు. 2000 కరెన్సీ నోటు విత్ డ్రా సమాచారం వెల్లడైనప్పటి నుంచి 500 కరెన్సీ నోట్లు ముద్రిస్తున్నారు. ఆదివారం నుంచి 500 కరెన్సీ నోట్ల ముద్రణ పెంచుతున్నారు. ప్రతి రోజూ 2.20 కోట్ల నుంచి 2.30 కోట్ల 500 కరెన్సీ నోట్లు ముద్రించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రెస్‌లో సుమారు 1100 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. నోట్ల ముద్రణ మిషన్ మీద 4-4 రబ్బర్ సిలిండర్లు పని చేస్తున్నాయి. నోట్ల ప్రింటింగ్ సిస్టమాటిక్‌గా జరిగేందుకు ఈ రబ్బర్ సిలిండర్లు ఉపయోగిస్తారు.
బీఎన్పీలో ఏడాది క్రితం వన్‌లైన్ మిషన్ ఇన్స్టాల్ చేశారు. రూ.2000 కరెన్సీ నోటును మార్కెట్లో చలామణీ నుంచి ఉపసంహరించాలని ఏడాది క్రితమే ఆర్బీఐ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దేవాస్’ బ్యాంకు నోట్ ప్రెస్‌లో ప్రస్తుతం 1.25 రెట్లు నోట్ల ముద్రణ జరుగుతున్నది. కొత్త నోట్ల ముద్రణ యంత్రంతో రెండు షిఫ్టుల్లో శరవేగంగా నోట్ల ప్రింటింగ్ సాగుతున్నది. ఒకవేళ కొత్త మిషన్ పని చేయకపోతే.. అందుబాటులో ఉండేలా పక్కనే పాత ప్రింటింగ్ మిషన్ కూడా సిద్ధంగా ఉంచారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

