ఐపీవోకు హైదరాబాదీ సంస్థలు

- ఈ నెల 16న వస్తున్న దొడ్ల డైరీ, కిమ్స్
- పబ్లిక్ ఇష్యూల విలువ రూ.2,664 కోట్లు
- వ్యాపార విస్తరణ, రుణ భారం తగ్గించడమే లక్ష్యం
ముంబై/న్యూఢిల్లీ, జూన్ 11: హైదరాబాద్‌కు చెందిన దొడ్ల డైరీ, కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వస్తున్నాయి. ఈ నెల 16న ఈ రెండు సంస్థల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లు మొదలవనున్నాయి. శుక్రవారం వెల్లడైన వివరాల ప్రకారం మూడు రోజులపాటు సాగే ఈ ఇష్యూల్లో దొడ్ల డైరీ.. ప్రమోటర్లు, మదుపర్లకు చెందిన రూ.520 కోట్ల విలువైన ఒక కోటీ 9 లక్షల 85,444 ఈక్విటీ షేర్లను అమ్మకానికి పెడుతున్నది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ రూ.50 కోట్లదాకా ఉన్నది. ఇక కిమ్స్.. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులకు చెందిన రూ.2,144 కోట్ల విలువైన 2 కోట్ల 35 లక్షల 60,538 ఈక్విటీ షేర్లను విక్రయానికి తెస్తున్నది.
ఫ్రెష్ ఇష్యూ విలువ రూ.200 కోట్ల వరకున్నది. దొడ్ల ఆఫర్ ఫర్ సేల్‌లో టీపీజీ దొడ్ల డైరీ హోల్డింగ్స్ (92 లక్షలు), దొడ్ల సునీల్‌రెడ్డి (4,16,604), దొడ్ల ఫ్యామిలీ ట్రస్ట్ (10,41,509), దొడ్ల దీపారెడ్డి (3,27,331) ఈక్విటీ షేర్లున్నాయి. ఐపీవో నిధులను రూ.32.26 కోట్ల బ్యాంక్ రుణాల చెల్లింపునకు, దాదాపు రూ.7.15 కోట్ల మూలధన వ్యయ అవసరాలకూ వినియోగిస్తామని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ ఎండీ సునీల్‌రెడ్డి తెలిపారు. కాగా, కిమ్స్ ఆఫర్ ఫర్ సేల్‌లో జనరల్ అట్లాంటిక్ సింగపూర్ కేహెచ్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లే ఒక కోటీ 60 లక్షల 3,615 ఉండటం గమనార్హం. ఇక మిగతా షేర్లలో డాక్టర్ భాస్కరరావు బొల్లినేని (3,87,966), రాజ్యశ్రీ బొల్లినేని (7,75,933), బొల్లినేని రమణయ్య మెమోరియల్ దవాఖానలు (3,87,966), ఇతర వాటాదారుల (60,05,058) ఈక్విటీ షేర్లున్నాయి.
క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్ల కోసం 75%, నాన్-ఇనిస్టిట్యూషనల్ బిడ్డర్ల కోసం 15%, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 10% షేర్లను కేటాయించారు. సంస్థ, దాని అనుబంధ సంస్థల రుణాలను తీర్చడానికి ఈ ఐపీవో నిధులను కిమ్స్ వాడనున్నది. కొటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, యాక్సిస్ క్యాపిటల్, క్రెడిట్ సూసీ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్‌లు ఈ ఇష్యూకు మేనేజర్లుగా ఉన్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ఈ షేర్లు నమోదు కానున్నాయి.
దొడ్ల డైరీ పబ్లిక్ ఇష్యూ
- ఐపీవో విలువ: రూ.520 కోట్లు
- షేర్ ధరల శ్రేణి: రూ.421-428
- ప్రారంభం: జూన్ 16, ముగింపు: జూన్ 18
- గతేడాది ఆఖరు నాటికి రుణ భారం రూ.87.37 కోట్లు
- తెలంగాణ, ఏపీ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో వ్యాపారం
- దొడ్ల డైరీ, దొడ్ల, కేసీప్లస్ వంటి బ్రాండ్లతో విక్రయాలు
కిమ్స్ పబ్లిక్ ఇష్యూ
- ఐపీవో విలువ: రూ.2,144 కోట్లు
- షేర్ ధరల శ్రేణి: రూ.815-825
- ప్రారంభం: జూన్ 16, ముగింపు: జూన్ 18
- ఉద్యోగుల కోసం రూ.20 కోట్ల షేర్లు కేటాయింపు
- తెలంగాణ, ఏపీల్లోని అతిపెద్ద కార్పొరేట్ హెల్త్‌కేర్ గ్రూపుల్లో ఒకటి
- ‘కిమ్స్ దవాఖానలు’ బ్రాండ్‌తో 9 మల్టీ-స్పెషాలిటీ దవాఖానలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders Attack | ఫేస్బుక్ మెటా ఆఫీస్ పై కాంగ్రెస్ నాయకుల దాడి
Hyderabad | నీటి ట్యాంకు నుంచి వృథాగా పోతున్న తాగునీరు..
Enugula Rakesh Reddy | యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ : ఏనుగుల రాకేష్‌రెడ్డి
Road Accident | ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

