IT Jobs | క్లౌడ్’కు ఫుల్ డిమాండ్.. ఐటీ ప్రొఫెషనల్స్‌కు మరింత మంచి రోజులు!

IT Jobs | కరోనా మహమ్మారితో వర్క్ ఫ్రం హోం.. లెర్నింగ్ ఫ్రం హోం కల్చర్ పెరిగింది. దాంతోపాటు ఐటీ ప్రొఫెషనల్స్‌కు గిరాకీ ఎక్కువైంది. ఇంతకుముందు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), డేటా అనలిటిక్స్ తదితర సాఫ్ట్వేర్లకు డిమాండ్ ఉండేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నిపుణుల అభివ్రుద్ది కోసం గతేడాది ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ సదస్సు నిర్వహించింది. తాజాగా క్లౌడ్ ప్రొఫెషనల్స్ కోసం అన్వేషణ పెరుగుతున్నది. దీంతో క్లౌడ్ ప్రస్తుతం మెయిన్‌స్ట్రీమ్, ఫౌండేషనల్ డిజిటల్ టెక్నాలజీగా అవతరించింది. తత్ఫలితంగా ఐటీ సంస్థలు క్లౌడ్ సొల్యూషన్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.

3.8 లక్షలకు డిమాండ్.. 1.15 లక్షలే నియామకం
కరోనా వల్ల గతేడాదిలో భారత్‌లోనే 3.8 లక్షల మంది క్లౌడ్ సొల్యూషన్స్ నిపుణులకు డిమాండ్ వచ్చింది. 2019తో పోలిస్తే 40 శాతం ఎక్కువ. కానీ, 1.15 లక్షల మంది నిపుణులను మాత్రమే ఇండియన్ ఐటీ సంస్థలు నియమించుకోగలిగాయి. మిగతా 2.65 లక్షల పోస్టులు అలాగే ఖాళీగా ఉన్నాయని టీసీఎస్, యాక్సెంజర్ భాగస్వామ్యంతో నాస్కామ్ రూపొందించిన నివేదిక వెల్లడించింది. క్లౌడ్ సొల్యూషన్స్ నిపుణుల కొరత వచ్చే నాలుగేండ్ల (2025) లో 7.69 లక్షలకు చేరుతుందని నాస్కామ్ అంచనా వేసింది. అదే ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలకు క్లౌడ్ నిపుణుల కొరత 20 లక్షలు దాటుతుందని ఐటీ నిపుణులు భావిస్తున్నారు.

శరవేగంగా కార్యాచరణతోనే ముందడుగు
పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా క్లౌడ్ సొల్యూషన్స్‌లో శరవేగంగా టాలెంట్ పూల్ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించుకోవాలని నాస్కామ్ నివేదిక సూచించింది. ఈ ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగితే క్లౌడ్ టాలెంట్ పూల్‌లో భారత్.. ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరవచ్చు. 17-18 లక్షల మంది క్లౌడ్ నిపుణులను ఇండియన్ ఐటీ రంగం పెంచుకుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో క్లౌడ్ విభాగంలో 6.08 లక్షల మంది నిపుణులతో భారత్ మూడోస్థానంలో ఉంది.

నాలుగేండ్లలో 800 బిలియన్ల డాలర్లకు క్లౌడ్ మార్కెట్
భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సొల్యూషన్స్ కోసం డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల డిమాండ్ 2022 నాటికి 20 శాతం ఎక్కువై రెవెన్యూ 398 బిలియన్ల డాలర్లకు చేరుతుందని వరల్డ్ వైడ్ ఎండ్ యూజర్ గార్టనర్ పేర్కొంది. నాస్కామ్ మరో నివేదిక ప్రకారం 2025 నాటికి గ్లోబల్ క్లౌడ్ టర్నోవర్ 800 బిలియన్ల డాలర్లకు చేరుతుందని అంచనా. భారత్‌లో వచ్చే ఏడాది నాటికి 26% గ్రోత్తో 5.6 బిలియన్ డాలర్లకు చేరుతుంది.
ఇవి కూడా చదవండి:
Schools Reopen | బడుల్లో పిల్లల భద్రత ఎలా? టీచర్స్ ఏమంటున్నారు? పేరెంట్స్ రియాక్షన్ ఏంటి?
Spondylitis | సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఎక్కువగా వేధిస్తున్న ఈ సమస్యను ఎలా జయించాలి?
NTR: కొత్త కారు కొన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇండియాలోనే ఎవరి దగ్గర లేదట
6G | 5జీ కన్నా 100 రెట్లు ఎక్కువ వేగం.. 6జీ విశేషాలు మరెన్నో..
WhatsApp : వాట్సప్‌లో అద్భుతమైన ఫీచర్.. త్వరలో అందుబాటులోకి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

