Bit Coin | స్టాక్స్ బాటలోనే బిట్ కాయిన్.. 16% పైపైకి..!
Bit Coin | క్రిప్టో కరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ కూడా స్టాక్స్ బాటలోనే పయనిస్తున్నది. రెండు వారాలుగా భారీగా పుంజుకున్నది.
Bit Coin | క్రిప్టో కరెన్సీ మేజర్ బిట్‌కాయిన్.. స్టాక్ మార్కెట్లను అనుసరిస్తున్నది. గత రెండు వారాల్లో జాతీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. అలాగే క్రిప్టో కరెన్సీల్లో బిట్ కాయిన్, ఎథీరియం కాయిన్లు లాభాల బాట పట్టాయి. శనివారం బిట్ కాయిన్ విలువ రెండు వారాల గరిష్ఠ స్థాయికి చేరింది. బిట్ కాయిన్ విలువ గురువారం నాటి కనిష్ఠ స్థాయి నుంచి 16 శాతం పెరిగి 41,983 డాలర్లకు చేరుకుంది. గత నెల 24న బిట్ కాయిన్ విలువ 32,950.72 డాలర్లు మాత్రమే. దాని ప్రకారం బిట్ కాయిన్ విలువ 27 శాతం తిరిగి పుంజుకుంది. గత నెల 21 తర్వాత ఈథర్ కాయిన్ విలువ 3,000 డాలర్లకు చేరుకోవడం ఇదే తొలిసారి.
శుక్రవారం బిట్ కాయిన్ విలువ ఏకంగా 11 శాతం పైపైకి దూసుకెళ్లింది. గతేడాది జూన్ నుంచి ఒక్కరోజులో క్రిప్టో మేజర్ లబ్ధి పొందడం ఇదే ఫస్ట్ టైం. కొన్ని రోజులుగా పతనమౌతూ వచ్చిన బిట్ కాయిన్‌కు లభించిన అతిపెద్ద మద్దతు కూడా ఇదే కావడం గమనార్హం. అమెరికాలోని స్టాక్ మార్కెట్లు కూడా ఈ వారం లాభాలతో ముగిశాయి.
ఇదిలా ఉంటే క్రిప్టో కరెన్సీ హెడ్జ్ ఫండ్ టైర్ క్యాపిటల్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఎడ్ హిండీ మాట్లాడుతూ ఇప్పటికీ మదుపర్లు బిట్ కాయిన్‌ను ఒక అసెట్ క్లాస్‌గానే చూస్తున్నారన్నారు. అందువల్లే బిట్ కాయిన్ విలువ ఒడిదొడుకులకు గురవుతున్నదన్నారు. స్టాక్ మార్కెట్లలో సూచీలతోపాటు క్రిప్టో ఇన్వెస్టర్లు కూడా బిట్ కాయిన్ అమ్మకాలకు దిగుతున్నారు. ఇండియన్ మార్కెట్లో బిట్ కాయిన్ 7.43 శాతం గెయిన్ అయి రూ.32,32,499 లకు చేరితే ఏథీరియం రూ.2,34,720లకు చేరింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

