LPG Cylinder | వంట గ్యాస్ బండ ధర చాలా చౌక’ట.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ
LPG Cylinder | పొరుగు దేశాలతో పోలిస్తే మనదేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధర చాలా చౌకగా రూ.603 లకే లభిస్తున్నదని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు.
LPG Cylinder | పొరుగు దేశాలతో పోలిస్తే, దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధర చాలా చౌక అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన రాత పూర్వక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 14.2 కిలోల సిలిండర్ ధర రూ.602 మాత్రమేనని అన్నారు. దేశీయ అవసరాల కోసం 60 శాతం ఎల్పీజీ గ్యాస్ దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు.
గ్లోబల్ మార్కెట్లో ఎల్పీజీ ధరల్లో అనిశ్చితి నెలకొన్నా ‘ఉజ్వల’ పథకం లబ్ధి దారులకు చౌకగా అందిస్తున్నట్లు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద ‘ఉజ్వల’ లబ్ధి దారులకు చౌక ధరకే వంట గ్యాస్ సిలిండర్ ధర కేంద్రం సరఫరా చేస్తున్నది.
‘ఉజ్వల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.603. పాకిస్థాన్‌లో రూ.1059.46, శ్రీలంకలో రూ.1053.35, నేపాల్‌లో రూ.1,198.56. మేం ఎల్పీజీ సిలిండర్లను 50 శాతం ధరకే పంపిణీ చేస్తున్నాం. గ్లోబల్ మార్కెట్లో పెరిగినా భారత్‌లో చౌక ధరకే అందజేస్తున్నాం’ అని హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు.
సౌదీ అరేబియా గత రెండేండ్లలో ఎల్పీజీ గ్యాస్ ధర టన్ను 415 డాలర్ల నుంచి 700 డాలర్లకు పెంచేసింది. దేశవ్యాప్తంగా ఉజ్వల లబ్ధిదారులు ఏడాదిలో 2.8 సిలిండర్లు వాడుతున్నారు. 9.6 కోట్ల మంది వినియోగిస్తున్నారు. వాస్తవంగా సాధారణ పౌరులకు వంట గ్యాస్ సిలిండర్ (14.2 కిలోలు) ధర రూ.955 పలుకుతున్నది. గత ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

