న్యూఢిల్లీ, జూలై 20: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సిట్రోయెన్ ఇండియా..దేశీయ మార్కెట్లోకి సరికొత్త సీ3ని పరిచయం చేసింది. ప్రారంభ ధర రూ.5.7 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ రూ.5.7 లక్షల నుంచి రూ.8.05 లక్షల మధ్యలో లభించనున్నది.