సెంట్రల్ బ్యాంక్, ఐఓబీలో వాటా విక్రయానికి కేంద్రం సన్నాహలు

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ లో పొందుపరిచిన మెగా ప్రైవేటీకరణ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లో వాటా విక్రయానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రణాళికలను ఖరారు చేయనుంది. ప్రైవేటీకరణ కోసం నీతి ఆయోగ్ ఈ రెండు బ్యాంకుల పేర్లను సిఫార్సు చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ)లోనూ ప్రభుత్వ వాటాను విక్రయించే ప్రతిపాదనలపై కసరత్తు సాగుతున్నట్టు సమాచారం. నీతి ఆయోగ్ ప్రతిపాదనపై ఈ దిశగా పెట్టుబడుల ఉపసంహరణ, ఆర్థిక సేవల శాఖలు సమీక్షిస్తున్నాయని తెలిసింది.
ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా నీతి ఆయోగ్ సిఫార్సు చేసే సేవలను మంత్రిత్వ శాఖలతో కూడిన అధికారుల కమిటీ, మంత్రుల గ్రూప్ పరిశీలించి అనంతరం మంత్రి మండలి ఆమోదానికి నివేదిస్తారు. మరోవైపు ఆర్థిక సేవల శాఖ ప్రతిపాదనపై తాము కసరత్తు సాగిస్తున్నామని, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు అవసరమైన చట్ట సవరణలపైనా చర్చిస్తున్నామని ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని పర్యవేక్షించే పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం పేర్కొంది. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటా విక్రయానికి ప్రణాళికలు ఖరారు చేసే ముందు ప్రభుత్వం ఆర్బీఐని కూడా సంప్రదించనుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

