ఇక ఆఫీసుకు వచ్చేయండి
దేశీయ ఐటీ రంగ సంస్థలు వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్‌హెచ్) నుంచి వర్క్ ఫ్రం ఆఫీస్ (డబ్ల్యూఎఫ్‌వో) వైపునకు అడుగులు వేస్తున్నాయి.
- ఇన్ఫోసిస్ నుంచీ ఉద్యోగులకు పిలుపు
- ఇప్పటికే నోటీసులిచ్చిన టీసీఎస్
బెంగళూరు, నవంబర్ 14: దేశీయ ఐటీ రంగ సంస్థలు వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్‌హెచ్) నుంచి వర్క్ ఫ్రం ఆఫీస్ (డబ్ల్యూఎఫ్‌వో) వైపునకు అడుగులు వేస్తున్నాయి. ఇన్ఫోసిస్ సైతం తమ ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి పనిచేయాలని కోరుతున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు అంతర్గతంగా ఉద్యోగులందరికీ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే దశలవారీగా వర్క్ ఫ్రం ఆఫీస్‌ను అమలు చేయాలని కంపెనీ యోచిస్తున్నదని అంటున్నారు.
కాగా, ఇప్పటికే దేశీయ ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్ ఈ తరహా ఆదేశాలను తమ ఉద్యోగులకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు హైబ్రిడ్ వర్క్ విధానాన్ని ప్రారంభించింది. కొంత మందిని ఇంటి దగ్గర్నుంచి, మరికొంత మందిని ఆఫీసుల నుంచి పనిచేయించుకోవడమే ఈ హైబ్రిడ్ పద్ధతి. వారంవారం లేదా నెలనెలా ఉద్యోగులు మారుతూ ఉంటారు. ఈ క్రమంలో దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఇదే బాటలో వెళ్తున్నట్టు వినిపిస్తున్నది.
మూడు దశల్లో..
‘త్రీ ఫేజ్ వర్క్ ఫ్రం ఆఫీస్ ప్లాన్’ను ఇన్ఫోసిస్ అనుసరించే వీలున్నట్టు చెప్తున్నారు. కంపెనీ నోటీసుల ప్రకారం..
- మొదటి దశలో ఉద్యోగుల వీలుననుసరించి వారానికి రెండుసార్లు ఆఫీసుకు రప్పిస్తారు.
- రెండో దశలో ఉద్యోగుల ఇష్టప్రకారం బదిలీలు, బ్రాంచీ ఆఫీసుల మార్పుంటుంది. 54 దేశాల్లో 247 చోట్ల ఇన్ఫోసిస్ కార్యకలాపాలున్నది తెలిసిందే.
- ఇక తుది దశలో తొలి రెండు దశల అనుభవంపై ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. దీని ఆధారంగా హైబ్రిడ్ వర్క్ పాలసీని అమలు చేస్తారు.
బలవంతం లేదు..
ఉద్యోగులందర్నీ మళ్లీ ఆఫీసులకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఇన్ఫీ సీఈవో సలీల్ పరేఖ్ చెప్తున్నారు. అయితే బలవంతంగా ఈ పని జరగబోదన్నారు. ఉద్యోగులను బలవంతంగా వెంటనే ఆఫీసులకు రప్పించే కార్యక్రమం ఏదీ లేదని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ డెవలప్మెంట్ విభాగం అధిపతి, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి శంకర్ కూడా ఓ ఈ-మెయిల్ ద్వారా తాజాగా స్పష్టం చేశారు. కరోనా ప్రభావం నేపథ్యంలో గడిచిన రెండున్నరేండ్లకుపైగా ఐటీ ఉద్యోగులు ఇండ్ల నుంచే పనిచేస్తున్నది విదితమే. అయితే వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వీరందరూ తిరిగి ఆఫీసుల నుంచి పనిచేసేలా ఆయా సంస్థల యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- infosys
- Infosys employees
RELATED ARTICLES
తాజా వార్తలు
RBI Gold Reserves | ఏడాదిలో 165 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. భారత్ వ్యూహమేంటి?
Jagapathi Babu | పనివాళ్ళతో కలిసి భోజనం చేసిన జగపతిబాబు.. స్టార్డమ్ పక్కనపెట్టి మనసులు గెలుచుకుంటున్న విలన్!
Srinivas Goud | ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
RamNagar Fish Market | రామ్‌నగర్ చేపల మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 40 కిలోల కుళ్లిన చేపలు పట్టివేత!
Bhogi Review | ‘భోగి’ సినిమా రివ్యూ.. శర్వానంద్ కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

