Foxconn | తెలంగాణపై ఫాక్స్‌కాన్ ఫోకస్.. రాష్ట్రంలో ఉత్పాదక కేంద్రాల విస్తరణ దిశగా అడుగులు
తైవాన్‌కు చెందిన బహుళజాతి ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్.. రాష్ట్రంలో పెట్టుబడుల విషయమై దూకుడును ప్రదర్శిస్తున్నది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భూమిని కొనుగోలు చేసింది. దాదాపు రూ.126 కోట్లతో 5 లక్షలకుపైగా చదరపు గజాల స్థలాన్ని (సుమారు 105 ఎకరాలు) సొంతం చేసుకున్నది.
- 126 కోట్లతో 5 లక్షలకుపైగా చదరపు గజాల స్థలం కొనుగోలు
- లక్ష ఉద్యోగాలను ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన సంస్థ
- కొంగరకలాన్ ప్లాంట్ తొలి దశతో 25 వేల కొలువులు
Foxconn | హైదరాబాద్, అక్టోబర్ 18: తైవాన్‌కు చెందిన బహుళజాతి ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్.. రాష్ట్రంలో పెట్టుబడుల విషయమై దూకుడును ప్రదర్శిస్తున్నది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భూమిని కొనుగోలు చేసింది. దాదాపు రూ.126 కోట్లతో 5 లక్షలకుపైగా చదరపు గజాల స్థలాన్ని (సుమారు 105 ఎకరాలు) సొంతం చేసుకున్నది. ఈ ఏడాది మార్చి 2న హైదరాబాద్‌లో ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూ పర్యటించిన నేపథ్యంలో ఈ డీల్ అంత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. నాడు తెలంగాణలో లక్ష ఉద్యోగాలను సృష్టించేందుకు ఫాక్స్‌కాన్ కట్టుబడి ఉన్నదని లియూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగానే హైదరాబాద్ సమీపంలోని కొంగరకలాన్ వద్ద యాపిల్ యాక్ససరీస్ ఉత్పాదక కేంద్రానికి ఫాక్స్‌కాన్ ఈ మే నెలలో శ్రీకారం చుట్టిన సంగతీ విదితమే.
ఈ ప్లాంట్ భూమిపూజకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు ఇతర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరవగా.. ఇది పూర్తయితే తొలి దశ కింద 25వేల ఉద్యోగాలు రానున్నాయి. సుమారు రూ.5,000 కోట్ల పెట్టుబడితో తెస్తున్న ఈ ఉత్పాదక కేంద్రంలో యాపిల్ ఎయిర్‌పాడ్స్, ఇతర యాక్ససరీస్ తయారు కానున్నాయి. ఈ క్రమంలో తాజా భూముల కొనుగోళ్లు ప్లాంట్ల విస్తరణకేనన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. అమెరికా బహుళజాతి టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌కు యాక్ససరీస్పరంగా అతిపెద్ద కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరర్‌గా ఫాక్స్‌కాన్ కొనసాగుతున్నది తెలిసిందే.
మరోవైపు దేశీయ ప్రముఖ రియల్ ఎస్టేట్ డాటా, అనలిటిక్స్, వర్క్‌ఫ్లో సొల్యూషన్స్ వేదిక ప్రాప్‌స్టాక్ వివరాల ప్రకారం చాంగ్ యీ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ (ఇండియా).. 2027కల్లా ఇక్కడి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, కంపోనెంట్స్ తయారీలో రూ.58.24 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలుస్తున్నది. ఇది తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ రంగానికి మరింత ఉత్సాహాన్నిస్తున్నది. ఇదిలావుంటే రాబోయే ఫాక్స్‌కాన్ ప్రాజెక్టు.. భారత్‌లో ఆ సంస్థకు భారీ పెట్టుబడిగా నిలుస్తున్నది. ఇప్పటిదాకా ఫాక్స్‌కాన్ ఒంటరిగా ఈ స్థాయిలో దేశంలో పెట్టుబడి పెట్టిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరింత విస్తరించాలని ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థ ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎఫ్‌ఐటీఎల్) చేస్తున్న ప్రయత్నాలు.. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులకు, కొలువులకు వీలు కల్పిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

