Bit Coin | జీరో దిశగా బిట్ కాయిన్.. ఇతర క్రిప్టోలదీ అదే దారి..!
Bit Coin | క్రిప్టో మేజర్ బిట్‌కాయిన్ విలువ జీరో దిశగా అడుగులేస్తున్నదని చైనా సర్కార్ దినపత్రిక ఎకనమిక్ డైలీ హెచ్చరించింది.
Bit Coin | క్రిప్టో కరెన్సీలు.. బిట్ కాయిన్.. దాదాపు 14 ఏండ్ల క్రితం 2008లో ఆర్థిక మాంద్యం వేళ తొలిసారి వినిపించిన పేరు. ప్రపంచ మానవాళిని వణికించిన కరోనా వేళ గ్లోబల్ స్టాక్‌మార్కెట్లు కుదేలవ్వడంతో ఇన్వెస్టర్లకు ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా కనిపించిన బిట్ కాయిన్ తదితర క్రిప్టో కరెన్సీలకు ఇప్పుడు డౌన్‌ట్రెండ్ స్టార్టయింది. సరిగ్గా ఏడాది క్రితం బంగారానికి ప్రత్యామ్నాయంగా.. డిజిటల్ గోల్డ్ అవతార్ బిట్ కాయిన్ అని వివిధ గ్లోబల్ ఫైనాన్స్ సంస్థలు అభివర్ణించాయి. కానీ.. ఇప్పుడు క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ విలువ జీరో దిశగా అడుగులు ( heading to zero ) అడుగులేస్తున్నదని ఇన్వెస్టర్లను చైనా ప్రభుత్వ దినపత్రిక ఎకనమిక్ డైలీ హెచ్చరించింది.
గతేడాది నంబర్లో 68 వేల డాలర్ల పైచిలుకు పలికిన బిట్ కాయిన్.. శనివారం క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ట్రేడింగ్‌లో సుమారు 21 వేల డాలర్ల వద్ద తచ్చాడుతున్నది. దీంతో క్రిప్టో కరెన్సీల మార్కెట్ పతనమవుతున్నదని ఇన్వెస్టర్లు హెచ్చరిస్తున్నారు. గతేడాది బిట్ కాయిన్‌ను చైనా నిషేధించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే పలు దేశాలు, ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు.. క్రిప్టో కరెన్సీ లావాదేవీలను నిషేధించాయి.
ఒకసారి ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని కోల్పోతే, బిట్ కాయిన్ సహా ఇతర క్రిప్టో కరెన్సీలన్నీ విలువ కోల్పోతాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. ఇదిలా ఉంటే, భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మాదిరిగానే సొంతంగా డిజిటల్ కరెన్సీ.. (సీబీడీసీ).. డిజిటల్ చైనీస్ యువాన్ (ఈ- సీఎన్‌వై e-CNY ) తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసింది. ఈ నెలలో బిట్ కాయిన్ 17,958 డాలర్లకు పడిపోయి తిరిగి 20 వేల మార్క్‌ను దాటింది. ఈ ఏడాది చివరికల్లా బిట్ కాయిన్ 14 వేల డాలర్లకు చేరువ కావచ్చునని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

