Biocon Biologics : బయోకాన్ బయోలాజిక్స్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా శ్రీహాస్ తాంబే నియమితులయ్యారు. ఈరోజు నుంచి ఆయన ఎండీ, సీఈఓగా విధుల్లో చేరనున్నారు. అరుణ్ చందవర్కర్ నుంచి శ్రీహాస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అరుణ్ చందవర్కర్ నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్- ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. బయోకాన్ కొత్త బాస్‌గా శ్రీహాస్ నియామకం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని బయోకాన్, బయోకాన్ బయోలాజికల్స్ ఛైర్మన్ కిరణ్ మజుందార్ షా తెలిపింది. అంతేకాదు ఆయన బిజినెస్ ట్రాక్ రికార్డు, టెక్నికల్, ఎగ్జిక్యూటివ్ స్కిల్స్ బయోకాన్‌ను ముందుకు నడిపించడంలో ఉపయోగపడతాయి అని ఆమె పేర్కొంది.
శ్రీహాస్ తాంబే 1997 నుంచి బయోకాన్‌లో పనిచేస్తున్నారు. ఈ 25 ఏళ్లలో ఆయన వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. బయోకాన్ బయోసిమిలర్ బిజినెస్‌ను మలేషియా, అమెరికా, యూరోపియన్ యూనియన్‌లో విస్తరించేందుకు శ్రీహాస్ ఎంతగానో కృషి చేశారు. ముంబై యూనివర్సిటీ నుంచి బయోప్రాసెసింగ్ టెక్నాలజీ మాస్టర్స్ పూర్తి చేశారు. పునే యూనివర్సిటీలో శ్రీహాస్ ఫార్మసూటికల్ సైన్స్, టెక్నాలజీ కోర్సు చదివారు.