పొదుపు ఖాతాలపై 7% వడ్డీరేటు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలు కెనరా, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) తమ పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను సవరించాయి. ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కూడా మార్పులు చేసింది. గరిష్ఠంగా 7 శాతం వార్షిక వడ్డీరేటు లభిస్తుండటం విశేషం. కాగా, ఖాతాలో నగదు నిల్వలనుబట్టి కెనరా బ్యాంక్ వడ్డీరేట్లలో వ్యత్యాసాలున్నాయి. దేశీయ, నాన్-రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ), నాన్-రెసిడెన్సీ ఆర్డినరీ (ఎన్ఆర్వో) ఖాతాలన్నింటికీ ఈ మార్పులు వర్తిస్తాయి.
- భారీ డిపాజిట్లకుగాను సవరించిన కెనరా, బీవోఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలు కెనరా, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) తమ పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను సవరించాయి. ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కూడా మార్పులు చేసింది. గరిష్ఠంగా 7 శాతం వార్షిక వడ్డీరేటు లభిస్తుండటం విశేషం. కాగా, ఖాతాలో నగదు నిల్వలనుబట్టి కెనరా బ్యాంక్ వడ్డీరేట్లలో వ్యత్యాసాలున్నాయి. దేశీయ, నాన్-రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ), నాన్-రెసిడెన్సీ ఆర్డినరీ (ఎన్ఆర్వో) ఖాతాలన్నింటికీ ఈ మార్పులు వర్తిస్తాయి.
రూ.100 కోట్లదాకా 2.50 శాతం వడ్డీరేటునిస్తున్న కెనరా.. రూ.2,000 కోట్లు ఆపై బ్యాలెన్స్ నిర్వహించే ఖాతాల్లో అత్యధికంగా 4 శాతం వార్షిక వడ్డీనిస్తున్నది. సెప్టెంబర్ 5 నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.50 కోట్లదాకా 2.50 శాతం వస్తుంటే.. రూ.3,000 కోట్లు ఆపై నిల్వలకుగాను 6.25 శాతం వడ్డీ ఉన్నది. సెప్టెంబర్ 1 నుంచే వర్తిస్తున్నాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో రూ.3 లక్షలదాకా 2.50 శాతం వార్షిక వడ్డీరేటుండగా.. రూ.25 లక్షలదాకా బ్యాలెన్స్‌లపై గరిష్ఠంగా 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. సెప్టెంబర్ 1 నుంచి అమలవుతున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఈ జాగ్రత్తలతో మధుమేహం నియంత్రణ’
Vaibhav Sooryavanshi: మెన్స్ టీ20 క్రికెట్లో యంగెస్ట్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు
దిష్టిబొమ్మ దహనం.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లకు గాయాలు
SpaceX: అతిపెద్ద రాకెట్‌ను ప్రయోగించిన స్పేస్ఎక్స్.. పేలిన ఫస్ట్ స్టేజ్ బూస్టర్
Ashok Galla | న్యూ ఇయర్ కానుకగా అశోక్ గల్లా ‘VISA – వింటారా సరదాగా’!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

