Bank Holidays | ఫిబ్రవరిలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు.. ఇదీ లిస్ట్!
Bank Holidays | నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలతో కలిపి ఫిబ్రవరిలో బ్యాంకులకు 12 రోజుల సెలవులు వచ్చాయి.

Bank Holidays | ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నారు. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలే జరుగుతున్నా.. కొన్ని ముఖ్యమైన అంశాల్లో బ్యాంక్ శాఖలకు వెళ్లాల్సిందే. అయితే, ఆయా బ్యాంకులు తెరిచే ఉన్నాయా.. లేదా.. అన్న విషయం తెలుసుకున్నాక వెళ్లడం మంచిదన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో ఆదివారాలు, రెండు శనివారాలు కలిపి మొత్తం 12 రోజులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. సహకార బ్యాంకులు, రీజినల్, విదేశీ బ్యాంకులు సైతం పని చేయవు. ఫిబ్రవరిలో వసంత పంచమి, గురు రవిదాస్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే.. ఆయా రాష్ట్రాల్లో కొన్ని పండుగల సందర్భంగా సెలవులు కూడా వస్తున్నాయి.
దేశవ్యాప్తంగా కొన్ని పండుగలకు మాత్రం బ్యాంకులు మూసి ఉంటాయి. రిపబ్లిక్ డే (జనవరి 26), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2), క్రిస్మస్ (డిసెంబర్ 25) తదితర ముఖ్యమైన పర్వదినాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన ముఖ్యమైన పనుల కోసం వెళ్లాలనుకున్నప్పుడు ఆర్బీఐ హాలీడే క్యాలెండర్‌ను చూసుకుని ముందుకెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. మనం కూడా ఓ లుక్కేద్దాం..
- ఫిబ్రవరి 5: సరస్వతి పూజ లేదా వసంత పంచమి
- 6: ఆదివారం
- 12 : రెండో శనివారం
- 13 : ఆదివారం
- 15 : మహ్మద్ హజ్రత్ అలీ బర్త్ డే (మణిపూర్‌లోని ఇంఫాల్, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, కాన్పూర్)
- 16 : గురు రవిదాస్ జయంతి (చండీగఢ్)
- 18: డోల్ జాత్రా (కోల్‌కతా)
- 19:ఛత్రపతి శివాజీ జయంతి (మహారాష్ట్రలోని బెలాపూర్, ముంబై, నాగ్‌పూర్)
- 20: ఆదివారం
- 26: నాలుగో శనివారం
- 27 : ఆదివారం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

