Amazon Q | చాట్‌జీపీటీకి పోటీగా అమెజాన్ ‘క్యూ’.. ఇవీ స్పెషాలిటీస్..!
Amazon Q | ఓపెన్ఏఐ చాట్‌జీపీటీకి పోటీగా ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ ‘చాట్‌బోట్-క్యూ’ తెచ్చింది. లాస్ వేగాస్‌లో జరిగిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) క్లౌడ్ వార్షిక సదస్సులో అమెజాన్ ఈ సంగతి బయట పెట్టింది.
Amazon Q | ఓపెన్ఏఐ చాట్‌జీపీటీకి పోటీగా ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ ‘చాట్‌బోట్-క్యూ’ తెచ్చింది. లాస్ వేగాస్‌లో జరిగిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) క్లౌడ్ వార్షిక సదస్సులో అమెజాన్ ఈ సంగతి బయట పెట్టింది. సాధారణ భాషల్లో వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని ఏడబ్ల్యూఎస్ సీఈఓ ఆడం సెలీప్ స్కై చెప్పారు. ఇది త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానున్నదని తెలుస్తున్నది.
2022 నవంబర్‌లో ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ సేవలు వినియోగంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీనికి పోటీగా గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థలు తమ సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బోట్లను తెస్తున్నాయి. కంటెంట్ తయారీ, రోజువారీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ క్రమబద్ధీకరణ, బ్లాగ్ పోస్ట్‌ల రచన వంటి పనులు తమ ‘క్యూ’ తేలిగ్గా చేస్తుందని అమెజాన్ పేర్కొంది.

ఇతర కంపెనీలు తమ ‘క్యూ’కు వారి అవసరాలకు అనుగుణంగా మార్చుకుని వాడుకోవచ్చునని అమెజాన్ పేర్కొన్నది. ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్, కంపెనీ డాక్యుమెంట్ పేజీలు, స్లాక్ తరహా డెవలపర్ ఎన్విరాన్మెంట్స్, థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా అమెజాన్ ‘క్యూ’ యాక్సెస్ పొందొచ్చు.
క్లౌడ్ కంప్యూటింగ్ సేవల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ కంటే ముందు వరుసలో నిలిచిన అమెజాన్.. జనరేటివ్ ఏఐ వంటి నూతన ఆవిష్కరణలకు మూలమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్‌లో వెనకబడింది. తాజాగా రూపొందించిన అమెజాన్ ‘క్యూ’పై అడ్మినిస్ట్రేటర్లు నియంత్రణ కలిగి ఉంటారు. అమెజాన్ ఎస్3, గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ షేర్ పాయింట్, సేల్స్ ఫోర్స్ వంటి 40+ పాపులర్ డేటా వనరులతో అమెజాన్ ‘క్యూ’ వస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

