మళ్లీ వాహన ధరలకు రెక్కలు?

- తయారీ ఖర్చులు పెరుగుతున్నాయంటున్న ఆటో సంస్థలు
న్యూఢిల్లీ, జూలై 27: వాహన ధరలను మరోసారి పెంచాలని ఆటోమొబైల్ సంస్థలు యోచిస్తున్నాయి. ఉత్పాదక వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ధరల పెంపు అనివార్యమన్న సంకేతాలను ఇస్తున్నాయి. స్టీల్ తదితర లోహాల ధరలు ప్రియమవడంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెండుసార్లు ఆయా సంస్థల కార్లు, టూవీలర్లు, ట్రక్కుల ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడోసారి పెంపు తప్పేట్లు లేదని టాటా మోటర్స్, బజాజ్ ఆటో వర్గాలు అంటున్నాయి. తయారీ ఖర్చులు తగ్గుముఖం పడుతాయని ఇన్నాళ్లూ వేచిచూశామని, కానీ లోహాల ధరలు పెరుగుతూపోతూనే ఉన్నాయని టాటా మోటర్స్ సీఎఫ్‌వో పీబీ బాలాజీ అన్నారు. ఈ నెలలో అన్ని వాణిజ్య వాహన ధరలను 1-2.5 శాతం మేర టాటా మోటర్స్ పెంచింది. ఏప్రిల్‌లో 2.5 శాతం పెంచిన సంగతి విదితమే. అయితే ప్యాసింజర్ వాహన ధరలను ఒక్కసారి మాత్రమే పెంచింది. మే నెలలో 1.8 శాతం పెరిగాయి. బజాజ్ ఆటో కూడా ధరల పెంపునకున్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నది. అయితే లాక్డౌన్ నేపథ్యంలో టూవీలర్ మార్కెట్లో నెలకొన్న స్తబ్ధత.. ధరల పెంపుపై పునరాలోచనలో పడేలా చేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చండ్రుగొండలో నీట మునిగిన పంట పొలాలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

