iPhone | ఐ-ఫోన్లలోకి ‘హ్యాకర్ల’ పెగాసెస్.. అలర్టయిన ఆపిల్.. ఏం చేసిందంటే..?!
iPhone | ఐ-ఫోన్లలో గుర్తించని లోపాల ఆసరగా హ్యాకర్లు ‘పెగాసెస్’ స్పైవేర్ చొప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంగతి తెలియగానే అలర్టయిన ఆపిల్.. ఐఫోన్ యూజర్లకు ఎమర్జెన్సీ సెక్యూరిటీ అప్ డేట్ అందజేసింది.
iPhone | ఐ-ఫోన్లలోకి కొందరు హ్యాకర్లు పెగాసెస్ స్పైవేర్ చొప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. వాషింగ్టన్‌లోని ఒక సివిల్ సొసైటీ సంస్థ ఉద్యోగి వాడుతున్న ఐ-ఫోన్లోకి హ్యాకర్లు ‘పెగాసస్’ స్పైవేర్ చొప్పించడానికి చేసిన ప్రయత్నాలను ఇంటర్నెట్ వాచ్డాగ్ ‘సిటిజన్ ల్యాబ్’ సంస్థ రీసెర్చర్లు గుర్తించారు. అంతకుముందు ఐ-ఫోన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను గుర్తించి.. ఆపిల్ యాజమాన్యానికి తెలియచేసింది. ఐ-ఫోన్లలో లోపాలను ‘జీరో డే బగ్స్’ అని సిటిజన్స్ ల్యాబ్స్ వ్యాఖ్యానించింది. దీంతో అలర్టయిన ఆపిల్ మేనేజ్మెంట్ వెంటనే సదరు బగ్స్ సరి చేసి, సెక్యూరిటీ అప్డేట్స్ అందించింది.
యూజర్ ఏం చేయకుండానే పెగాసస్ స్పైవేర్ ఇన్‌స్టల్ అయ్యేలా హ్యాకర్లు మాల్వేర్ చొప్పిస్తారు. అది యాక్టివేట్ అయిన మరుక్షణం.. యూజర్‌కి తెలియకుండానే కెమెరా ఆన్ అవుతుంది. ఆటోమేటిక్‌గా వాయిస్ రికార్డవుతుంది. అప్పట్లో విపక్ష నేతలు, జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలపై నిఘా పెట్టేందుకు పెగాసస్ స్పైవేర్‌ను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసినట్లు రాజకీయంగా విమర్శలు వచ్చాయి. పెగాసస్ స్పైవేర్’ను ఇజ్రాయెల్ ప్రభుత్వం తయారు చేసింది. వివిధ దేశాల ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తుందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Apple
- Business news
- Hackers
- IPhones
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

