Amazon-Future | దిగొచ్చిన అమెజాన్-ఫ్యూచర్.. సింగపూర్ కోర్టుకెళ్లేందుకు రెడీ!
Amazon-Future | సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టులో వివాద పరిష్కారానికి అమెజాన్, ఫ్యూచర్ అంగీకారానికి వచ్చాయి.
Amazon-Future | రిలయన్స్ రిటైల్‌లో విలీనం వివాదంపై అమెజాన్, ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) ఓ అంగీకారానికి వచ్చాయి. సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) ముందు వివాదాన్ని పరిష్కరించుకోవడానికి సిద్ధమని సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపాయి. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలోని ధర్మాసనానికి నివేదించారు. ఫ్యూచర్-అమెజాన్ మధ్య వివాదంపై మధ్యవర్తిత్వ పిటిషన్ సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం ముందు తమ వివాదాన్ని పరిష్కారానికి రెండు పక్షాలు (అమెజాన్, ఫ్యూచర్) పరస్పర అంగీకారానికి వచ్చాయి. కనుక మంగళవారం జాయింట్ మెమో ఆఫ్ కన్సెంట్ టర్మ్స్ దాఖలు చేయాలని ఆదేశించాం. ఈ అంశంపై బుధవారం విచారణ చేపడతాం అని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్‌లు కృష్ణ మురారీ, హిమకోహ్లీలతో కూడిన ధర్మాసనం తెలిపింది.
అమెజాన్-ఫ్యూచర్ వివాదంపై ఢిల్లీ హైకోర్టులో జరుగుతున్న విచారణ, తదుపరి వాయిదా పూర్తి వివరాలు తెలియజేయాలని రెండు పక్షాలను ధర్మాసనం కోరింది. ఈ అంశంపై విచారణ కోసం పదేపదే దస్త్రాల కుప్ప సమర్పించడం పట్ల చీఫ్ జస్టిస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగితాల మూట మా మీద వేసి భారం మోపొద్దని అభ్యర్థిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

