న్యూఢిల్లీ, జనవరి 7: ముత్తూట్ ఫైనాన్స్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ ముత్తూట్ హోంఫిన్(ఇండియా) లిమిటెడ్ సీఈవోగా అలోక్ అగర్వాల్ నియమితులయ్యారు. హౌసింగ్ ఫైనాన్స్ సేవలను మరింత విస్తరించడంతోపాటు దిగువ మధ్య తరగతి కుటుంబాలకు గృహ రుణాలు మరింత సులువుగా అందచేయాలనే ఉద్దేశంతో నాయకత్వ మార్పులు చేసినట్లు వెల్లడించింది.
ఆర్థిక సేవల విభాగంలో 20 ఏండ్లకు పైగా అనుభవం కలిగిన అలోక్‌తో తమ వ్యాపారం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా అలోక్ అగర్వాల్ మాట్లాడుతూ..ముత్తూట్ గ్రూపులో భాగం కావడం చాలా సంతోషంగా ఉన్నదని, హోంఫిన్కు నేతృత్వం వహించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదములు అని చెప్పారు.