Crypto Currency | క్రిప్టోల దూకుడు..24 గంటల్లో రూ.64 వేలు పెరిగిన బిట్‌కాయిన్
Crypto Currency | క్రిప్టో కరెన్సీలు దూకుడు మీదున్నాయి. బిట్ కాయిన్, ఎథీరియం ఆదివారం ట్రేడింగ్‌లో భారీగా లబ్ధి పొందాయి.
Crypto Currency | క్రిప్టో కరెన్సీ లావాదేవీలు ఆదివారం పుంజుకున్నాయి. ప్రధాన క్రిప్టో కాయిన్లు లాభాల్లో సాగుతున్నాయి. గత 24 గంటల్లో క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ రెండు శాతం లబ్ధితో రూ.33.03 లక్షలకు చేరుకున్నది. గత 24 గంటల్లో బిట్ కాయిన్ ధర రూ.64 వేలకు పైగా పెరిగింది. అయితే, ఇప్పటికీ బిట్ కాయిన్ తన ఆల్‌టైం రికార్డు ధర కంటే 36 శాతం తక్కువగానే ఉంది. రెండో స్థానంలో ఉన్న ఎథీరియం 1.61 శాతం లబ్ధి పొంది రూ.3,801 వద్ద పెరిగింది. ఎథీరియం విలువ రూ.2.39 లక్షల వద్ద నిలిచింది.
కాయిన్ పేరు — ధర (రూపాయల్లో) – – 24 గంటల్లో మార్పు — మొత్తం మార్పు (శాతం)
బిట్ కాయిన్ – రూ. 33,03,817 — — — రూ. 64,917 — — —– 2.00
ఎథీరియం — రూ. 2,39,318 — ——– రూ.3,801 — —- — —– 1.61
టెథర్ — —— రూ. 79.51 — ———- రూ. 1.17 — — —- —– 1.49
యూఎస్డీ —- రూ.79.47 —- —– —– రూ. 1.21 ———- —– 1.55
రిపిల్ — —- రూ. 53.31 — —- —— రూ. 0.59 —- — — —- 1.12
సొలానా —- రూ. 9,169 ——– —— రూ. 176.92 — —- —– 1.97
పొల్కాడాట్- రూ. 1,705 — — —- — రూ. 10.47 — — —- — 0.62
పొలిగాన్ — రూ. 137.78 —- —– — రూ. 1.92 —- — ——- 1.42
డోజ్కాయిన్- రూ. 11.75 —- —– — రూ. 0.09 —— —- —- 0.87
క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను పే చేయాల్సిందే
క్రిప్టో కరెన్సీ లాభాలపై ఇక నుంచి ఇన్వెస్టర్లు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అన్ని రకాల క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై ఒకశాతం టీడీఎస్ అమలవుతుంది. ఆర్బీఐ జారీ చేసే డిజిటల్ కరెన్సీని మాత్రమే అధికారిక డిజిటల్ కరెన్సీగా గుర్తిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. బిట్ కాయిన్, ఎథీరియం వంటి క్రిప్టో కరెన్సీలపై సంపాదించే ఆదాయంపై పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

