అమ్మకానికి కాంకర్
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఎయిర్ ఇండియాను అమ్మేసిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక కంపెనీ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్)ను విక్రయించడానికి సంసిద్ధమవుతున్నది.
- వ్యూహాత్మక వాటా విక్రయిస్తున్న కేంద్ర ప్రభుత్వం
- వచ్చే నెలలో బిడ్స్‌కు ఆహ్వానం
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఎయిర్ ఇండియాను అమ్మేసిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక కంపెనీ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్)ను విక్రయించడానికి సంసిద్ధమవుతున్నది. కాంకర్‌కు వచ్చే జనవరి నెలలో ప్రాథమిక బిడ్స్‌ను ఆహ్వానించనున్నట్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జనవరిలో ప్రాధమిక బిడ్స్‌ను ఆహ్వానించిన తర్వాత కాంకర్ విక్రయ ప్రక్రియ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తవుతుందని, ఇందుకు 10 నెలల సమయం పడుతుందని ఆ అధికారి వివరించారు.
ఈ సంస్థలో ప్రభుత్వానికి 54.80 శాతం వాటా ఉంది. ఇందులో 30.8 శాతం వ్యూహాత్మక వాటాను యాజమాన్య నియంత్రణతో సహా విక్రయించాలన్న ప్రతిపాదనకు 2019లో కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. విక్రయం తర్వాత వీటో అధికారాలు లేకుండా 24 శాతం వాటాను ప్రభుత్వం అట్టిపెట్టుకుంటుంది. కాంకర్ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియపై ఇంకా కసరత్తు జరుగుతున్నదని, జనవరికల్లా ఆసక్తివ్యక్తీకరణ (ఈఓఐ)బిడ్స్‌ను ఆహ్వానించాలని ప్రయత్నిస్తున్నట్టు ఆ అధికారి వివరించారు.
2023-24లో ఎస్సీఐ, బీఈఎంఎల్ వంతు
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ)కు ఉన్న భూఆస్తులు, షిప్పింగ్ వ్యాపారానికి చెందని ఆస్తుల్ని కంపెనీ నుంచి వేరుపర్చాలన్న ప్రతిపాదనకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ అనుమతి ఈ నెలలో లభించవచ్చని భావిస్తున్నామని ప్రభుత్వ అధికారి వెల్లడించారు.
ఆస్తుల్ని విభజించిన సంస్థను లిస్ట్ చేయడానికి రెండు నెలల సమయం పడుతుందని, అటుతర్వాత వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ఫైనాన్షియల్ బిడ్స్‌ను ఆహ్వానిస్తామన్నారు. ఎస్సీఐ, బీఈఎంఎల్, హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ల వ్యూహాత్మక వాటా విక్రయం 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరుగుతుందన్నారు. ఎస్సీఐ యాజమాన్య బదిలీతో సహా 63.75 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తున్నది. ఈ వాటా కొనుగోలుకు 2021 మార్చిలో పలు ప్రాధమిక బిడ్స్ అందాయి. అయితే డీమెర్జర్ ప్రక్రియంలో జాప్యం జరిగింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

