Rs 2000 Notes | 76 శాతం రూ.2000 నోట్లు వెనక్కి.. ఆర్బీఐ వెల్లడి
Rs 2000 Notes | మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 76 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చిందని ఆర్బీఐ సోమవారం ప్రకటించింది.
Rs 2000 Notes | మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 76 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చిందని ఆర్బీఐ సోమవారం వెల్లడించింది. అత్యధికంగా ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు చేశారని తెలిపింది. రూ.2000 కరెన్సీ నోట్లను మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు గత మే 19న ఆర్బీఐ ప్రకటించింది.
రూ. 2000 కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి గానీ, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి గానీ సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ గడువు విధించింది. బ్యాంకుల నుంచి వచ్చిన డేటా ప్రకారం గత నెలాఖరు (జూన్ 30) నాటికి రూ.2.72 లక్షల కోట్ల విలువైన రూ.2000నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ వివరించింది.
ప్రస్తుతం మార్కెట్లో ఇంకా రూ.84 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో మే 19 నుంచి జూన్ 30 వరకు రూ.2000కరెన్సీ నోట్లు 76 శాతం తిరిగి వెనక్కి వచ్చాయని తేలింది. 87 శాతం నోట్లు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల ద్వారా, మిగతా 13 శాతం ఇతర డినామినేషన్ నోట్లతో మార్పిడి జరిగిందని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

