Reliance ties 7-Eleven | 7-ఎలెవెన్‌తో రిలయన్స్ జట్టు.. అంధేరీలో తొలి స్టోర్..!
Reliance ties 7-Eleven | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ రిటైల్.. అమెరికా జెయింట్ 7-ఎలెవెన్ ఇంక్‌తో జత కట్టింది.

Reliance ties 7-Eleven | అమెరికా జెయింట్ రిటైలర్ 7-ఎలెవెన్ ఇంక్‌తో రిలయన్స్ అనుబంధ రిలయన్స్ రిటైల్ జత కట్టింది. 7-ఎలెవెన్ ఇంక్‌తో మాస్టర్ ఫ్రాంచైసీ ఎగ్రిమెంట్ కుదుర్చుకున్నది. ఈ డీల్‌లో భాగంగా ముంబైలోని అంధేరిలో తొలి 7-ఎలెవెన్ స్టోర్ శనివారం (అక్టోబర్ 9)న ప్రారంభం కానున్నది. అటుపై గ్రేటర్ ముంబైలోని వాణిజ్య ప్రాంతాలకు, పొరుగున ఉన్న పట్టణాలు, నగరాలకు శరవేగంగా విస్తరించనున్నది 7-ఎలెవెన్ ఇంక్. రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ విలీన ఒప్పందంపై ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్‌తో న్యాయ పోరాటం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా కంపెనీతో రిలయన్స్ జత కట్టడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

బెస్ట్ బిజినెస్ పద్దతులకు 7-ఎలెవెన్
7-ఎలెవెన్ ఇంక్ (ఎస్ఈఐ) బిజినెస్ మోడల్‌ను రిలయన్స్ అడాప్ట్ చేసుకోవడంలో రిలయన్స్‌కు ఎస్ఈఐ చేయూతనివ్వనున్నది. ఇక ఇప్పటికే రిలయన్స్‌తో జత కట్టిన విషయమై స్టాక్ ఎక్స్చేంజీలకు ఎస్ఈఐ సమాచారం కూడా ఇచ్చింది. 7-ఎలెవెన్ స్టోర్‌లో కస్టమర్లకు ఉత్తమ నాణ్యత గల సరుకులు.. తినడానికి, తాగడానికి రుచికరమైన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. బెస్ట్ బిజినెస్ పద్దతులను అవలంభించడంలో రిలయన్స్‌కు సాయపడతామని తెలిపింది. అవసరాన్ని బట్టి 7-ఎలెవెన్ కన్వినియెన్స్ రిటైల్ బిజినెస్ మోడల్‌ను అడాప్ట్ చేసుకుంటామని, అందుకు ఎస్ఈఐ చేయూతనిస్తుందని రిలయన్స్ తెలిపింది.

ఫ్యూచర్‌తో కలిసి 7-ఎలెవెన్ యత్నం
ఇంతకుముందు ఫ్యూచర్ రిటైల్‌తో కలిసి దేశీయంగా వ్యాపార లావాదేవీల్లో ఎంటరవ్వాలని 7-ఎలెవెన్ ఇంక్ భావించింది. ఇందుకోసం ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన డీల్ రెండు రోజుల క్రితం అంటే మంగళవారం రద్దయింది. రెండేండ్లుగా భారత్‌లో స్టోర్స్ తెరవడానికి 7-ఎలెవెన్ ప్రయత్నిస్తోంది. మాస్టర్ ఫ్రాంచైసీ ఫీజు చెల్లించడంలో ఫ్యూచర్ విఫలం కావడంతో ఫ్యూచర్-7 స్టోర్ ప్రారంభ యత్నానికి సంధి కొట్టింది. 2019లో 7-ఎలెవెన్‌తో ఫ్యూచర్ రిటైల్ మాస్టర్ ఫ్రాంచైసీ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. గతేడాది ప్రారంభంలో స్టోర్ తెరవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. డీల్ కుదిరిన తర్వాత ఏడాదికి పైగా సమయం గడిచిపోవడంతో ఆ ఒప్పందం రద్దయింది.

రిలయన్స్‌లో విలీనానికి ఫ్యూచర్
మరోవైపు, అప్పుల ఊబిలో చిక్కుకున్న ఫ్యూచర్ రిటైల్.. తన కష్టాల నుంచి బయటపడే మార్గాలను అన్వేషించింది. అందుకోసం రిలయన్స్ రిటైల్‌లో విలీనానికి ఫ్యూచర్ కుదుర్చుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా అమెజాన్ న్యాయపోరాటం చేస్తోంది. 2019లో ఫ్యూచర్ గ్రూప్ అనుబంధ ఫ్యూచర్ కూపన్స్‌లో అమెజాన్ 49 శాతం వాటా కొనుగోలు చేసింది.

ఫ్యూచర్-రిలయన్స్ డీల్‌పై అమెజాన్ ఇలా
ఫ్యూచర్‌తో కుదిరిన డీల్లోనే మూడేండ్ల నుంచి 10 ఏండ్లలోపు ఫ్యూచర్ రిటైల్ కొనుగోలు హక్కు అమెజాన్‌కు దఖలు పడింది. అమెజాన్‌కు అనుకూలంగా సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులుజారీ చేసింది. ఇది భారత్‌లో చట్టబద్ధమేనని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌తో తమ విలీన ఒప్పందాన్ని రిలయన్స్ మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఈ నెలలోనే నిర్ణయం తీసుకున్నది.
7-ఎలెవెన్ ఇంక్ కంపెనీకి 18 దేశాల్లో 77 వేలకు పైగా స్టోర్లు ఉన్నాయి. ఇవి 7-ఎలెవెన్ ఇంక్ స్వయంగా. ఫ్రాంచైసీల ద్వారా నడుపుతోంది. ఫ్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్‌తోపాటు అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఇందులో లభిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- 7-eleven
- Reliance Retail
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

