Cyber Fraud | కేవైసీ అప్డేట్ కోసం లింక్ పంపిన మోసగాళ్లు.. 40 మందికి రూ.లక్షల్లో బురిడీ!
Cyber Fraud | కేవైసీ, పాన్ డిటైల్స్ అప్ డేట్ పేరిట వచ్చిన ఫేక్ లింక్స్ క్లిక్ చేసిన 40 మంది ముంబైకర్లు ప్రైవేట్ బ్యాంకు ఖాతాదారులు రూ. లక్షల్లో డబ్బులు కోల్పోయారు.
Cyber Fraud | ఆన్లైన్ మోసాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్బీఐ, టెలికం శాఖ, వివిధ బ్యాంకులు ఖాతాదారులకు హెచ్చరికలు చేస్తున్నా..సైబర్ మోసగాళ్ల వలలో పడుతున్నారు ప్రజలు. వారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఈ ఘటన ముంబైలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో చోటు చేసుకుంది. నో యువర్ కస్టమర్ (కేవైసీ), పాన్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోవాలని కొందరు వ్యక్తుల మొబైల్ ఫోన్లకు ఫేక్ మెసేజ్‌లు వచ్చాయి. ఆ మెసేజ్‌లు క్లిక్ చేసిన వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.లక్షల్లో డబ్బు మాయమైంది. ప్రతి బ్యాంకు ఖాతాదారు, ఖాతా ఓపెన్ చేసినప్పుడు వారి కేవైసీ పత్రాలు సమర్పించడం తప్పనిసరి. ఈ నిబంధనను అడ్డం పెట్టుకుని మోసగాళ్లు 40 మందిని బురిడి కొట్టించారు. ఆపై రూ.లక్షల్లో నగదు మాయం చేశారు.
ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాదారులు అటువంటి లింక్‌లు క్లిక్ చేయొద్దని ముంబై పోలీసులు హెచ్చరించారు. కేవైసీ, పాన్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోకుంటే బ్యాంక్ ఖాతా బ్లాక్ చేస్తామని పేర్కొంటూ మోసగాళ్లు పంపే లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంక్ ఫేక్ వెబ్సైట్లోకి వెళ్లి కస్టమర్ ఐడీ, పాస్వర్డ్, ఇతర కాన్ఫిడెన్షియల్ డిటైల్స్ నమోదు చేయాలని పేర్కొని, అలా చేసిన 40 మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి నగదు విత్ డ్రా చేసేశారు. అలా మోసపోయిన వారిలో టీవీ నటి శ్వేత మెమన్ కూడా ఉన్నారు.
గత గురువారం తన ఫోన్‌కు వచ్చిన లింక్, బ్యాంకుదేమోనని భావించి క్లిక్ చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో శ్వేత మెమన్ తెలిపారు. పోర్టల్ ఓపెన్ కాగానే, వారి కస్టమర్ ఐడీ, పాస్వర్డ్స్, ఓటీపీ నమోదు చేశారు. అటుపై బ్యాంకు అధికారినంటూ ఓ మహిళ ఫోన్ కాల్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫోన్లో మాట్లాడిన మహిళ చెప్పినట్లు మరో ఓటీపీ నంబర్ నమోదు చేశానని, అటుపై తన బ్యాంకు ఖాతా నుంచి రూ.57,636 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చిందని వాపోయారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

