Jawa 42 Bobber | త్వరలో మార్కెట్లోకి జావా 42 బాబర్ బైక్.. ?!
Jawa 42 Bobber | జావా అండ్ యెజ్డీ కంపెనీ నుంచి కొత్త మోడల్ మోటారు బైక్ మార్కెట్లోకి రానున్నది. జావా 42 బాబర్ పేరుతో రూపుదిద్దుకుంటున్నది.
Jawa 42 Bobber | రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield).. జావా & యెజ్డీ (Jawa & Yezdi).. స్టయిలిష్‌గా కుర్రాళ్లను ఉర్రూతలూగించే బైక్స్.. ఇప్పటికే రాయల్ ఎన్ ఫీల్డ్ నూతన అవతార్‌లో ‘బుల్లెట్-350’ బైక్ ఆవిష్కరించింది. జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ తన 2023 మోడల్ 42 బాబర్ బైక్ టీజ్ చేసింది. ట్యూబ్ లెస్ టైర్లతో కూడిన అల్లాయ్ వీల్స్‌తో రూపుదిద్దుకున్నదీ బైక్. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జావా యెజ్డీ 42జావా బైక్ ట్యూబ్ టైప్ టైర్లు కలిగి ఉంటుంది. అంతే కాదు.. తాజా మోడల్ 42 బాబర్ బైక్.. రెండో దశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నది.
కర్బన ఉద్గారాలను నియంత్రిస్తూ.. సౌకర్యవంతంగా రైడింగ్ చేసేందుకు వీలుగా రూపుదిద్దుకున్నది 42 బాబర్ బైక్. 334 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తో వస్తున్నదీ మోటారు సైకిల్. ఈ ఇంజిన్ గరిష్టంగా 30.22 బీహెచ్పీ విద్యుత్, 32.75 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది.
యెజ్డీ రోడ్‌స్టర్ ఫ్యుయల్ ట్యాంక్ తోపాటు న్యూ హ్యాండిల్ బార్, న్యూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉంటాయి. జావా 42 బాబర్ (మైస్టిక్ కాపర్) మోడల్ బైక్ రూ.2,12, 500, జావా 42 బాబర్ మూన్ స్టోన్ వైట్ రూ.2,13,500, జావా 42 బాబర్ జాస్పర్ రెడ్ మోడల్ రూ.2,15,187 పలుకుతుందని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

