SpiceJet layoffs | స్పైస్‌జెట్‌లో కొలువుల కోత : 1400 మంది ఉద్యోగులపై వేటుకు కసరత్తు
SpiceJet layoffs : నిర్వహణ వ్యయాలను తగ్గించుకునే క్రమంలో దాదాపు 1400 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని స్పైస్‌జెట్ ప్రణాళికలు రూపొందిస్తోంది.
SpiceJet layoffs : నిర్వహణ వ్యయాలను తగ్గించుకునే క్రమంలో దాదాపు 1400 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని స్పైస్‌జెట్ ప్రణాళికలు రూపొందిస్తోంది. గత కొద్దినెలలుగా ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎయిర్‌లైన్ వేతన బిల్లులో కోతల దిశగా కొలువుల కోతకు తెగబడుతోంది.
స్పైస్‌జెట్‌లో ప్రస్తుతం దాదాపు 9000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా 30 విమానాలను ఎయిర్‌లైన్ ఆపరేట్ చేస్తోంది. వ్యయ నియంత్రణ చర్యల నేపధ్యంలో లేఆఫ్స్‌కు మొగ్గుచూపక తప్పలేదని స్పైస్‌జెట్ ప్రతినిధి నిర్ధారించారని వార్తలొచ్చాయి. లాభదాయకతను మెరుగుపరుచుకునేందుకు మానవవననుల క్రమబద్ధీకరణలో భాగంగా ఈ సంక్లిష్ట నిర్ణయం తీసుకున్నామని స్పైస్‌జెట్ వర్గాలు పేర్కొన్నాయి.
లేటెస్ట్ లేఆఫ్స్‌తో ఏడాదికి రూ 100 కోట్ల వరకూ కంపెనీకి ఆదా అవుతుందని తెలిపాయి. లేఆఫ్స్ ప్రభావిత ఉద్యోగుల్లో పలువురికి ఇప్పటికే టెర్మినేషన్ కాల్స్ అందాయనే వార్తలతో స్పైస్‌జెట్‌లో కొలువుల కోతపై సిబ్బందిలో గుబులు రేగుతోంది. ఇక ఉద్యోగుల్లో చాలామందికి ఇప్పటికీ జనవరి వేతనాలు రాలేదని చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

