RBI on Rs.2000 | ఆర్బీఐ సంచలన నిర్ణయం.. రూ.2 వేల నోటు ఉపసంహరణ
RBI on Rs.2000 | మార్కెట్లో రూ.2000 నోటు చలామణి నుంచి ఆర్బీఐ ఉపసంహరించుకున్నది. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు మార్చుకునేందుకు ప్రజలకు అనుమతి ఇచ్చింది.
RBI on Rs.2000| అంతా అనుకున్నట్లే అయింది. 2016 నవంబర్ 8 అర్థరాత్రి అర్ధంతరంగా నోట్ల రద్దు ప్రకటించిన కేంద్రం.. ప్రజల సౌకర్యార్థం రూ.2000, రూ.500 నోటు తీసుకొచ్చింది. కానీ, రూ.2000 నోటు వల్ల బ్లాక్ మనీ పెరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్నది.
రూ.2000 నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటించింది. దేశంలోని 19 ప్రాంతీయ ఆర్బీఐ శాఖల్లో వాటిని మార్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. బ్యాంకులు సైతం రూ.2000 నోట్లను సర్క్యులేషన్లో పెట్టవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.
రూ.2000 నోట్లు ఉన్న వారు వచ్చే సెప్టెంబర్ 30 లోగా బ్యాంకుల్లో సబ్మిట్ చేసి మార్చుకోవాలని స్పష్టం చేసింది. ఒక్కొక్కరూ ప్రతి విడతలోనూ రూ.20 వేల విలువైన నోట్లు మార్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ నెల 23 నుంచి రూ.2000 నోటు మార్చుకోవడానికి వెసులుబాటు కల్పించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

