White Hair | మందార పూలతో జుట్టు తెల్లబడటం తగ్గుతుందా? ఏం చేయాలి?
White Hair | జుట్టు చివర్లు చిట్లడం, నెరవడం, రాలిపోవడం ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యనే. దీన్ని నివారించేందుకు చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మందార పూలే కాదు.. మందార ఆకులు కూడా వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
White Hair | జుట్టు చివర్లు చిట్లడం, నెరవడం, రాలిపోవడం ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యనే. దీన్ని నివారించేందుకు చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాల్లోనే మందార పూలతో జుట్టును దృఢంగా చేసుకోవచ్చని చాలామంది చెబుతుంటారు. మందార పూలే కాదు.. మందార ఆకులు కూడా వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మరి దీనికోసం మందార పూలు, ఆకులతో ఏం చేయాలంటే..
› ఏడెనిమిది చొప్పున మందార పూలు, ఆకుల్ని శుభ్రంగా కడిగి ముద్దలా చేయాలి. కప్పు కొబ్బరి నూనెను వేడి చేసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. నూనె చల్లారాక వడకట్టి రాత్రుళ్లు తలకు రాసుకొని మర్నాడు తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
› తెల్లవెంట్రుకలతో బాధపడేవారు గుప్పెడు మందార ఆకులు, నాలుగు పెద్ద చెంచాల పెరుగు తీసుకొని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుండటం వల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.
› మూడు చెంచాల ఉసిరిపొడి, రెండు చెంచాల ఉసిరి రసం, గుప్పెడు మందార ఆకుల్ని తీసుకొని మెత్తగా చేసుకోవాలి. ఈ ముద్దను తలంతా పట్టించి నలభై నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చాలు.
› ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి వేడిచేయాలి. మరుగుతున్న నీళ్లలో గుప్పెడు మందార ఆకులు, అయిదారు పూలు వేయాలి. కాసేపు మరిగించాలి. చల్లారాక ఆకుల్ని ముద్దలా చేయాలి. కొద్దిగా శనగపిండి కలిపితే షాంపూ తయారైనట్లే.
› ఏడెనిమిది మందార పూలను ముద్దలా నూరుకోవాలి. దీన్ని తలకు పట్టించి గంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో ఒకటి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది.
Read More :
Hair fall remedies | జుట్టు రాలడం తగ్గాలంటే.. ఈ చిట్కాలు పాటించండి”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

